హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా.. వాతావరణం చల్లగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాల నుండి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజి పొంగి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నీరు నులుస్తుంది. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. దీంతో గ్రేటర్ పై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఈ దోమలతో ముఖ్యంగా డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో నగర వ్యాప్తంగా రోజు రోజుకు జ్వరంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దోమ కాటు వల్ల ఈ జ్వరాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 900 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికం భాగ్యనగరంలోనే.. వర్ష కాలం కావడంతో డెంగీకి వ్యాధికి కారణం అయ్యే టైగర్ దోమ విజృంభిస్తోంది. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో డెంగీ జ్వరం బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అత్యథికంగా.. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కి ఎక్కువ మంది రోగులు జ్వరంతో డెంగీ పరీక్షల కోసం వస్తున్నారు.
గ్రేటర్‌లో డెంగీ డేంజర్ బెల్స్… !
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ బారిన పడి వందల మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 900 డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో సగానికి పైగా హైదరాబాద్ నగరంలోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 65 రోజుల్లో 114 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మేలో 39, జూన్‌లో 56, జూలై 4వ తేదీ వరకు 19 కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రిలో రోజూ 350కి పైగా ఓపీ కేసులు వస్తుండగా, అందులో 50 నుంచి 70 మంది దాకా డెంగ్యూ లక్షణాలు ఉన్నవారేనని సమాచారం. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రిలో కూడా చాలా మంది డెంగ్యూ లక్షణాలతో వస్తున్నట్లు తెలుస్తోంది.
టైగర్ దోమ కాటుతో వచ్చే లక్షణాలు..
ఈ టైగర్ దోమ కుట్టిన 3-4 రోజుల నుంచే వంటి నొప్పులతో మొదలై తీవ్ర జ్వరం, తలనొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. తొలి దశలో తీవ్ర జ్వరం, ఒంటిపై దద్దుర్లు ఉంటాయని అంటున్నారు. రెండో దశలో ప్లేట్‌లెట్లు తగ్గడం, బీపీ పడిపోవటం, కడుపులో నొప్పి, వాంతులు, కాలేయంపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. రెండో దశలో లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో చేరాలని సూచిస్తున్నారు.
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు..