TOP NEWS: డయల్ తెలుగు నేటి టాప్ 10 వార్తలు

డయల్ తెలుగులో నేటి టాప్ 10 వార్తలు.

  • Written By:
  • Updated On - March 4, 2024 / 08:52 PM IST

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే: మోదీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు ప్రధాని మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, ఈ విషయంలో ఇప్పుడు రెండు పార్టీలు కలిసిపోయాయని విమర్శించారు ప్రధాని మోదీ.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి:  PM MODI: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు.. కుటుంబ పార్టీల్ని నమ్మొద్దు: ప్రధాని మోదీ

 

మోదీ నాకు పెద్దన్న: రేవంత్
మోదీ తనకు పెద్దన్నలాంటి వారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో ఘర్షణపడటం రాష్ట్రాభివృద్ధికి ఆటంకం అన్నారు. కేంద్రంతో కలిసి సాగుతామన్నారు. ఆదిలాబాద్ సభలో మోదీతో కలిసి రేవంత్ పాల్గొన్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి:  REVANTH REDDY: కేంద్రంతో వైరం రాష్ట్రాభివృద్ధికి ఆటంకం.. పెద్దన్నలా మోదీ సహకరించాలి: సీఎం రేవంత్

 

నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు

నాలుగు పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిKCR: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు

 

ప్రశాంత్ కిషోర్‌పై వైసీపీ ఎదురుదాడి

ఏపీలో వైసీపీ 40 సీట్లకు మించి గెలవలేదన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రశాంత్ కిషోర్‌పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిPrashant Kishore : బిహార్‌లో పనేం లేదా ? పీకేను ఆటాడుకుంటున్న వైసీపీ నేతలు

 

కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాబు మోహన్.. కేఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆయన వరంగల్ నుంచి ప్రజా శాంతి తరఫున పోటీ చేయబోతున్నారు.

పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిBABU MOHAN: కేఏ పాల్ పార్టీలోకి బాబుమోహన్‌.. ఏం హాలత్ ఐపాయె సార్‌…

 

మోదీకా పరివార్.. ట్రెండింగ్..
మోదీకా పరివార్ పేరిట బీజేపీ నేతలు సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టారు. మోదీకి కుటుంబం లేదని లాలూ విమర్శిస్తే.. దేశమే తన కుటుంబమని ప్రధాని అన్నారు. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి:  MODI KA PARIVAR: అప్పుడు చౌకీదార్.. ఇప్పుడు పరివార్‌.. లాలూ మాటలను ఆయుధంగా మార్చుకున్న బీజేపీ..

 

ఉదయనిధిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టాలిన్ సామాన్యుడు కాదని, మంత్రి అయ్యుండి అలా మాట్లాడొచ్చా అంటూ విమర్శించింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిUdhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

 

సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కమ్మిన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్‌ను ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కమ్మిన్స్ ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిPat Cummins: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్.. మార్క్‌రమ్ స్థానంలో కమ్మిన్స్‌కు సారథ్య బాధ్యతలు

 

అనంత్ అంబానీ వాచీ ఖరీదు అన్ని కోట్లా..?

ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనంత్ అంబానీ ధరించిన వాచీ ధరపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వాచ్ ఇన్నికోట్లా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిMUKESH AMBANI COSTLY THINGS: కోట్లల్లో ఆస్తులు.. అనంత్ అంబానీ వాచీ 8 కోట్లు ! ఖరీదైనవి ఇవే..

 

కన్నప్ప సినిమాలో స్టార్ కొరియోగ్రాఫర్
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిkannappa: మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి మరొకరు.. కన్నప్ప కోసం ప్రభుదేవా