కోహ్లీ తప్పు చేశాడా ? ఫైన్ తో వదిలేసిన ఐసీసీ…!

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 26, 2024 / 03:09 PM IST

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం ఆటగాడు 19 ఏళ్ళ సామ్ కాన్స్టాస్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలింగ్ దళాన్ని ధీటుగా ఎదుర్కొని అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ ఫిఫ్టీకి ముందు మైదానం మధ్యలో కాన్స్టాస్, కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. కోహ్లీ తన భుజంతో సామ్ కాన్స్టాస్‌ను నెట్టడం కనిపించింది, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మెల్‌బోర్న్ టెస్టులో 10వ ఓవర్ ముగిసిన తర్వాత సామ్ కాన్స్టాస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లి ముందు నుంచి వచ్చి సామ్‌ను భుజంతో నెట్టాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుబడుతున్నారు. కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే సామ్ కోన్‌స్టాస్‌ను ఢీ కోట్టాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.ఆ సమయంలో కామెంట్రీ చెబుతున్న పాంటింగ్.. ఉద్దేశపూర్వకంగానే కోహ్లీ.. సామ్ కోన్‌స్టాస్‌ను ఢీకొట్టాడనే విషయం రిప్లేలను చూస్తే అర్థమవుతుందన్నాడు

ఇప్పుడు ఈ వ్యవహారంపై ఐసీసీ విచారణ జరపనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్‌లో ఒక ఆటగాడిని శారీరకంగా స్లెడ్జింగ్ చేయడం నిషేధం. ఇలాంటి ఘటనలో ఆటగాడు లెవెల్ 2 కింద దోషిగా పరిగణించబడతాడు. ఇప్పుడు విరాట్ లేదా సామ్ ఎవరి తప్పు చేసినా వారిపై 3 నుంచి 4 డీమెరిట్ పాయింట్ల భారం పడుతుంది. అయితే ఇలాంటి సంఘటనల్లో మ్యాచ్ నిషేధానికి చాలా తక్కువ అవకాశం ఉంది. లెవెల్ 2 నేరంగా పరిగణిస్తే 3 నుంచి 4 డీ మెరిట్ పాయింట్స్ విధిస్తారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం నుంచి 100 శాతం‌తో పాటు ఒక సస్పెన్షన్ పాయింట్‌తో మూడు డీ మెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్స్‌తో పాటు నాలుగు డీ మెరిట్ పాయింట్స్ కూడా కేటాయించే అవకాశం ఉంది.

గత 24 నెలల్లో ఓ ఆటగాడు నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్‌ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క డీమెరిట్ పాయింట్ కూడా లేదు. కానీ తాజా ఘటనను మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించి నాలుగు డీ మెరిట్ పాయింట్స్ కేటాయిస్తే మాత్రం అతను చివరి టెస్ట్‌ ఆడకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్ నిషేధం నుంచి తప్పించుకున్న కోహ్లీ… 20 శాతం మ్యాచ్‌ ఫీజు జరిమానా విధించారు.