మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో పోలిస్తే, పుష్ప 2కే ఎక్కువ హైప్ రావాలి. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టే పుష్ప2 మరింత దుమ్ముదులపాలి. కాని దేవరలో సగం రేంజ్ లోకూడా హైప్ క్రియేట్ కావట్లేదు. అక్కడే మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న తేడా, వెనక రీజన్ మతిపోగొడుతోంది. యాంటీ ఫ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్ కి ఊహకుమించిన ఇమ్యూనిటీ ఉంది. అంతగా తన క్రేజ్, ఇమేజ్ తో తను ఫైట్ చేశాడు. ఐకాన్ స్టార్ కూడా యాంటీ ఫ్యాన్స్ తో ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఫేస్ చేశాడు. కాని తనకి అద్రుష్టం భయంకరంగా కలిసొచ్చింది. దాంతో పుష్ప2కి ప్లస్ అవ్వాలి.. కాని మైనెస్ అవుతోంది. అదే ఎన్టీఆర్ కి, బన్నీకి ఉన్న తేడా అనే మాట వినిపిస్తోంది. ఇంతకి ఏంటా తేడా? అద్రుస్టం అలా ఎలా అల్లు అర్జున్ ని ఎన్టీఆర్ కంటే ఏడడుగులు వెనక్కి నెడుతోంది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని, అర్జెంట్ గా అల్లు అర్జున్ అలియాస్ ఐకాన్ స్టార్ తో పోల్చాల్సిన అవసరం రావటానికి రీజన్ దేవర, పుష్ప2 కి మధ్య ఉన్నతేడానే… దేవరకి పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. నిజం చెప్పాలంటే తన సినిమా ఈవెంట్లకు సరిగా పర్మీషన్స్ కూడా రాలేదు.. అయినా దేవర మీద హైప్ బాక్సాఫీస్ ఊగిపోయేంత వచ్చింది. ఇది దేవర విడుదలకు ముందు సీన్..
దీనికి తోడు దేవర మీద జరిగినంత ట్రోలింగ్, కామెంట్లు రెబల్ స్టార్ మూవీల మీద కూడా జరగలేదు. బాహుబలితో ఫోకసైన ప్రభాస్ ని యాక్సెప్ట్ చేయటానికి బాలీవుడ్ మీడియాలో చాలా మందికిచాలా ఏళ్లు పట్టింది. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని మాత్రం తొక్కేసే ప్రయత్నం దేవర విడుదలకు ముందే భారీగా జరిగింది
అయినా దేవర నలిగిపోలేదు.. నడక ఆపలేదు.. తర్వాత సీనీ సునామీ రాకుండా ఆగలేదు. బేసిగ్గా ఎన్టీఆర్ మూవీ వస్తోందంటేనే, తన సినిమా మీద జరిగే నెగెటీవ్ ప్రచారం మామూలుగా ఉండదు.. యాంటీ ఫ్యాన్స్ కి తనమీద బురద చల్లటం తప్ప మరో పనుండదు.. అలా ఇక్కడే యాంటీ ఫ్యాన్స్ ని తట్టుకున్న తను, నార్త్ ఇండియాలో యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ని తట్టుకోవటం పెద్ద విషయం కాదు.
కాకపోతే ఊహించినదానికంటే ఘోరంగా దేవర మీద నార్త్ లో కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేశారు. లక్కీగా నార్త్ లో ఎన్టీఆర్ కి పెరిగిన మాస్ ఫాలోయింగ్ వల్ల ఆ కామెంట్లు దేవర కలెక్షన్స్ ని టచ్ కూడా చేయలేకపోయాయి. దానికితోడు కామెంట్ల దాడి పెరిగేకొద్ది కలెక్షన్ల వర్షం కురిసింది.. ఇదంతా తెలిసిన వ్యవహారమే.. ఐతే అర్జెంట్ గా ఈ అంశం అల్లు అర్జున్ తో పోలిక పెరగటానికి కారనం యాంటీ ఫ్యాన్స్ ఎటాకే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్2 మీద కూడా యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ జరిగింది. కాని అది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే.. అది కూడా చాలా లిమిటెడ్ గా… విచిత్రం ఏంటంటే ఇప్పుడా ఎటాక్ పూర్తిగా తగ్గింది. తన ప్రతీ మూవీకి ఇలానే జరుగుతోంది. సో ఎవరైతే ఎక్కువగా కాంప్లికేటెడ్ సిచ్చువేషన్స్ ఫేస్ చేస్తారో వాళ్లకి ఆటోమేటిగ్గా రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ నెగెటీవ్ ప్రచారమనే రోగం విషయంలో ఎన్టీఆర్ కి ఎప్పుడో యాంటీ బాడీస్ వచ్చేశాయి.. తను అంతలా మొదట్నుంచి ఫైట్ చేస్తున్నాడు
కాని బన్నీ మీద అప్పడప్పుడు జరిగే, ఎటాక్ ని ఎన్టీఆర్ మీద జరిగిన, జరుగుతన్న దాడితో పోల్చలేం… దీనికి తోడు బన్నీకి కాలం కూడా కలిసొస్తుండటంతో, థింగ్స్ ఈజీ అవుతున్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి కాలం కలిసొస్తుందో, కష్టపడాల్సిన పని తగ్గుతుంది. దాంతో ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ తగ్గుతుంది. అందుకే పుష్ప హిట్టైనా పుష్ప2 కి రిలీజ్ కి ముందే 1000 కోట్ల ప్రీరిలజీ్ బిజినెస్ అయినా, దేవర రేంజ్ లో హైప్ రావట్లేదు. దేవర రేంజ్ పూనకాలు కనిపించట్లేదు.