అయోధ్యలో ఈనెల 22న జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అది బీజేపీ, RSS సొంత వ్యవహారంలా ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. కానీ రామ మందిరం ఓపెనింగ్ కి వెళ్ళకపోతే.. లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు పోతాయేమోనని భయపడుతున్నారు. కొందరు లీడర్లయితే అధిష్టానం నిర్ణయంతో తమకు సంబంధం లేదు.. ప్రారంభోత్సవానికి వెళ్ళి తీరతామంటున్నారు.
అయోధ్యలో ఈనెల 22న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతోంది. ఆలయం ట్రస్ట్ తరపున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు.. మిగతా లీడర్లకు ఆహ్వానాలు పంపారు. కానీ రామాలయం ప్రారంభోత్సవానికి రావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ఉత్సవాన్ని బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ (RSS).. తమ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నాయనీ.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని మండిపడింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), సోనియా గాంధీ (Sonia Gandhi), అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan) .. ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. హిందువులందరికీ (Hindus) సంబంధించిన పండుగలా లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబట్టింది బీజేపీ. భారత సంస్కృతి అన్నా.. హిందువులన్నా కాంగ్రెస్ కు ఇష్టం లేదని మరోసారి రుజువైందని విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. రామమందిర్ (Ram Mandir) బాబ్రీ మసీదు (Babri Maseed) వివాదానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసిన ఇక్భాల్ అన్సారీయే ఈ ప్రారంభోత్సవానికి వస్తుంటే.. కాంగ్రెస్ కు ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నిస్తున్నారు కమలం పార్టీ నేతలు.
బీజేపీ ఆరోపణలతో కాంగ్రెస్ కి డ్యామేజ్ అవుతుందిన ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ నేతలైతే తాము రామ మందిరం ప్రారంభోత్సానికి వెళ్తామన్నారు. శ్రీరాముడు యావత్ భారత దేశానికి ఆరాధ్య దైవం. ఇది నమ్మకాలకు సంబంధించి వ్యవహారం.. కార్యక్రమానికి వెళ్ళకూడదు అనేది పొలిటికల్ డెసిషన్ అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కూడా కొంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రామమందిరం అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదనీ.. అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడమే.. ఈ జన్మలో చేసుకున్న అదృష్టం అంటున్నారు.
అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో రాజకీయపార్టీల (Political parties) జోక్యాన్ని శంకరాచార్య మఠాధిపతులు కూడా తప్పుబడుతున్నారు. రాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడం కరెక్ట్ కాదని.. పూరీ పీఠాధికపతతి అన్నారు. రామాలయం నిర్మాణం పూర్తి కాకుండానే హడావిడిగా ఈ ప్రారంభోత్సవం ఎందుకని జ్యోతీష్ మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవి ముక్తేశ్వరానంద సరస్వతి ప్రశ్నించారు.
కానీ ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు మాత్రం రామాలయం ప్రారంభోత్సవానికి వెళతామని చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హిందువుల ఓట్లకు గండిపడితాయని అంటున్నారు. బీజేపీ తమకు నెగిటివ్ ప్రచారం చేఇస్తే ఇబ్బందుల్లో పడతామంటున్నారు.