Heavy rains : రాష్ట్రంలో భిన్న వాతావరణం.. పగలు ఎండలు.. సాయంత్రం వర్షాలు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో వేడెక్కిపోయాయి.

 

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో వేడెక్కిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో పలు జిల్లాలో తెలికపాటి నుంచి భారీ వర్షాలు కురుశాయి.

Kavitha’s bail : కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు..

వదదెబ్బ తగలకుండా చర్యలు..
కారణంగా కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఈఎస్ఐసీ ఆదేశించింది. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్సీడీసీ మార్గదర్శకాల మేరకు డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్సలు అందించాలని సూచించింది. కార్మికలకు పని ప్రదేశాల్లో తాగునీరు అందించాలని తెలిపింది.

బాలయ్య అల్లుడు శ్రీ భరత్ తో యాంకర్ దీప ఇంటర్వ్యూ

ఈ జిల్లాల్లో భారీ వర్షం..
నల్గొండ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నల్గొండ, చిట్యాల, నకిరేకల్, నాంపల్లి, చండూరు సహా నూతనకల్, నార్కట్‌పల్లి, ములుగు, గుండాలలో భారీ వర్షం పడింది. వర్షానికి పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోవడంతో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మామిడాలలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పలు జిల్లాలో రైతులు కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిచిపోయి ఆవేధన చేందుతున్నారు.

Venigandla Ramu Interview : విజయ్ సాధుతో టీడీపీ నేత వెనిగండ్ల రాము ఇంటర్వ్యూ..

ఇక మరోవైపు రాష్ట్రంలో వడదెబ్బ, పిడుగుపాటుకు 8 మంది మృతి చెందారు. ఏటూరునాగారానికి చెందిన బుల్లెయ్య అనే రైతు, మిర్చి కల్లం వద్ద పిడుగు పడటంతో అక్కడే మృతి చెందాడు. కోడూరు గ్రామానికి చెందిన అజయ్‌ అనే యువకుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్‌లో వ్యవసాయ బావి వద్ద కట్టేసిన కాడెద్దుపై పిడుగుపాటుతో మృతి చెందింది. మహబూబాబాద్‌ జిల్లా రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలోని తాడిచెట్టుపై పిడుగు పడింది.

SSM