Weather update : దేశంలో భిన్న వాతావరణం.. 5 రోజులు అతి వర్షాలు

దక్షిణాది రాష్ట్రాల్లో జూన్ 17, 18 తేదీల్లో కేరళలో, జూన్ 17న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో, మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో, జూన్ 17, 18 తేదీల్లో గోవాలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

 

 

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NRML, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, HYD, VKB, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఈశాన్య రాష్ట్రాలకు జూన్ 21 వరకు రెడ్ అలర్ట్..

ఈశాన్య రాష్ట్రాల్లో అయిన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలో జూన్ 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి ఒక అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది.

భారీ వర్షాలు..

దక్షిణాది రాష్ట్రాల్లో జూన్ 17, 18 తేదీల్లో కేరళలో, జూన్ 17న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో, మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో, జూన్ 17, 18 తేదీల్లో గోవాలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 40-50 కిలోమీటర్లు), మహారాష్ట్రలో రానున్న 5 రోజుల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వడగాలులు..

ఇక రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు (Meteorological Department) బీహార్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్ మీదుగా రుతుపవనాలు ముందుకు కదులుతాయి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మరో వైపు ఉత్తరాది రాష్ట్రాలకు వడగాల్పులు వీస్తాయని ఇందులో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, దిల్లీ, పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. జూన్ 15న నేడు జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్​లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.