లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తమిళ దళపతి విజయ్ చేసిన మూవీ లియో. వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈసినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అంతవరకు ఓకే కాని, విడుదలైన రెండు వారాల తర్వాత తీరిగ్గా, ఇప్పుడు ఈ మూవీ కలెక్సన్స్ మీద కామెంట్లు, ట్రోలింగ్ పెరిగాయి.ఫేక్ కలెక్సన్స్ అంటూ కామెంట్ల ఘాటుపెంచారు.
సోషల్ మీడియాలో విజయ్ మూవీ లియో కలెక్షన్స్ మీద యాంటీ ఫ్యాన్స్ కామెంట్ల దాడి చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. లియో ఓపెనింగ్స్ 140 కోట్లన్నారు. యూఎస్ లో 5 మిలియన్లు అంటే, 40కోట్లు వచ్చాయన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ వసూళ్లే వచ్చాయి.
ఐతే తమిళ నాటనే 300కోట్ల వసూళ్ల లెక్క హాస్యాస్పదం అంటున్నారు. అన్ని థియేటర్స్ లేవు, ఆ రేంజ్ లో పూనకాలు రాలేదు..ఏదో విడుదలైన రెండు మూడు రోజులు కలెక్సన్స్ కిక్ ఇచ్చాయంటే అనుకోవచ్చు కాని, మిక్స్ డ్ టాక్ వచ్చిన మూవీ ఇంకా వందలకోట్లు కొల్లగొడుతుందంటే ఎలా నమ్మాలని ట్రోలింగ్ పెంచారు నెటీజన్స్. అంతేకాదు ఆన్ లైన్ లో టిక్కెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. థియేటర్స్ లో సీట్లు ఖాలీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు ఏదో సెన్సేషన్ జరిగిందని లియో నిర్మాతలు ఫేక్ కలెక్సన్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారని, కేవలం అజిత్ మూవీ కంటే ఎక్కువ రాబట్టిన సినిమా అనిపించుకునేందుకు ఇలా తప్పుడు లెక్కలు చెబుతున్నారనే వాదన పెరిగింది.