తరుణ్ భాస్కర్ కీడా కోలా ఎప్పుడెప్పుడా అన్నచర్చ యూత్ లోపెరిగింది. సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం యూత్ డిస్కర్స్ చేసేంత వరకొచ్చింది. అంతా చూస్తే ఇందులో టాప్ స్టార్ లేడు. అలాని ఇదేం పాన్ ఇండియా రేంజ్ మూవీకాదు. కనీసం మాస్ మూవీకానేకాదు. కానీ యూత్ లో విచిత్రమైన ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ క్రేజ్ పెంచేందుకే మొన్నటి వరకు కీడాకోలా రిలీజ్ డేట్ ని తేల్చలేదు. ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ అని డిసైడ్ అయ్యారు.దీంతో యూత్ పండగ చేసుకునేలా ఉంది.
ఈమాత్రం సినిమాకు అంత సీన్ ఏంటా అన్న ప్రశ్నే థర్టీ ప్లస్ బ్యాచ్ కి వస్తోన్నప్రశ్న. యూత్ కి ఏ సినిమా ఎందుకు నచ్చుతుందో చెప్పలేం. మొన్న బేబీ నచ్చింది. షార్ట్ ఫిల్మ్ ని కాస్త ఖర్చు పెట్టి తీసినట్టుందని మిడిల్ ఏజ్ డ్ బ్యాచ్ అంతే, యూత్ మాత్రం ఈ మూవీని వందకోట్ల సినిమాగా మార్చారు.
ఇవెలాంటివంటే, మార్కెట్ పల్స్ తెలిసిన సినీ విశ్లేషకులకు కూడా అర్దం కాని విచిత్రాలు.. ఒకప్పడు ఇలానే ఉపేంద్ర సినిమాలు యూత్ ని ఆకట్టుకునేవి. కంటెంట్ లేదంటే హీరో ఇలా ఇవేం కాదు, కేవలం ఉపేంద్ర మూవీలంటే ఏదో క్రేజీగా ఉంటాయనే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అచ్చంగా పెళ్లిచూపులు, ఈనగరానికి ఏమైంది లాంటి సినిమాలతో తరుణ్ భాస్కర్ కి కూడా అలాంటి గుర్తింపే వచ్చింది. కాబట్టే ఈనగరానికి ఏమైంది రీరిలీజ్ తో సీనే మారింది. అది చూసే ధైర్యం వచ్చిన కీడాకోలాని నవంబర్ 3 కి విడుదల చేసే ప్రయత్నం చేస్తోంది ఫిల్మ్ టీం.