ప్రపంచం ఇప్పటివరకు చూసిన దానికంటే 20 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం కాగల మరో మహమ్మారిని త్వరలో ప్రపంచంము ఎదుర్కొనబోతుంది.
డిసీజ్ -ఎక్స్ వైరస్ అంటే ఏమిటి..?
డిసీజ్ -ఎక్స్ అనేది ఒక అంతుచిక్కని వైరస్.. ఎబోలా, హెచ్ఐవీ-ఎయిడ్స్ కోవిడ్-19 వైరస్ ల కంటే అత్యంత వేగంగా ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చేందే ప్రాణాంతక మైన వైరస్. మానవులపై వాటి దాడి కరోనా కంటే ఏడు రెట్లు తీవ్రమైనదని నిపుణులు పేర్కొన్నారు. 2018-19 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రపంచానికి ఒక అంతుచిక్కని వ్యాధి/వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందని.. ముందుగానే హెచ్చరిస్తు వచ్చింది. అది నిజంగా 2020 లో మనం కళ్లారా చూశాం కూడా.. మరీ ఇప్పుడేందుకు ఆ విషయాలు అని అంటారా.. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో సరి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న. అదే “డిసీజ్-ఎక్స్” వైరస్.
ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం వహించిన సైంటిస్టు కేట్ బ్రిఘం హెచ్చరించారు.
బ్రిఘం హేమ్స్ పుస్తకం ఏం చేపుతుంది..?
భవిష్యత్తులో కోవిడ్ -19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్లు, జంతువులలో వైరస్ విస్తరిస్తుంది, మ్యుటేషన్ ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్ గా మారుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో బ్రిఘం వివరించారు. ఈ పుస్తకానికి వ్యాక్సిన్ నిపుణుడు టిమ్ హ్యామ్స్ సహ రచయితగా ఉన్నారు. వేలాది రకాల వైరస్ ల నుంచి మహమ్మారి ప్రబలేందుకు అవకాశముంది. ఇందులో 25 వైరస్ కుటుంబాలను సైంటిస్టులు గుర్తించారు. ప్రతి కుటుంబంలో వేలాది రకాల వైరస్ లుంటాయి. దీంట్లో ఏదో ఒక వైరస్ వల్ల మహమ్మారి ప్రబలే అవకాశముంది. అని టిమ్ హ్యామ్స్, బ్రిఘం తెలిపారు. భవిష్యత్తులో మహమ్మారి రాబోతున్నదని డబ్ల్యూహెచ్ లో 2018 లో హెచ్చరించింది. వైరస్ ను డీసీజ్ ఎక్స్ గా పేర్కొన్నది.
డిసీజ్-ఎక్స్ వ్యాప్తి..
ఎబోలా, హెచ్ఐవీ-ఎయిడ్స్ కోవిడ్-19 వైరస్ లు తొలుత జంతువుల్లో ప్రవేశించి, ఈ తర్వాత జంతువుల నుంచి మానవులకు సోకాయి. డీసీజ్-ఎక్స్ కూడా అదే విధంగా ఉండొచ్చనని సైంటిస్టుల భావిస్తున్నారు.
డీసీజ్ -ఎక్స్ వ్యాప్తి..ని మానవాళి ఎదుర్కొగలదా..?
ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా.. అత్యధికంగా మరణాల రేటు కలిగిన ఎబోలా, బర్డ్ ఫ్లూ, మెర్స్.. వైరస్ లనే అరికట్టాం, కానీ రాబోయే మహమ్మారిని సులభంగా ఎదుర్కొనవచ్చు నన్న అభిప్రాయాన్ని బ్రిగమ్, హేమ్స్ కొట్టిపారేశారు. ఎందుకంటే ఆ వైరస్ ఒక్కసారి మానవులకు వ్యాప్తి చెందితే అది ఏలా మరో వ్యక్తికి సంక్రమిస్తుంద.. వ్యాప్తి చెందిన వ్యక్తి లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తాయి ఎవరికి తెలియదు. ఇంక తేలియనిది ఏమిటి అంటే ఈ వైరస్ మానవ శరీరంలోని ఏ వ్యవస్థపై దాడి చేస్తుంది అనే శాస్త్రవేత్తలకే తేలియడం లేదు అంటే అర్థం చేసుకోండి.
నిపుణుల అభిప్రాయం ఏమిటి..?
UK ఆరోగ్య నిపుణుడు కేట్ బింగ్‌హామ్ ప్రకారం, ఈ వ్యాధి యొక్క లక్షణాలు త్వరలో కనిపించవచ్చు. ఈ వైరస్ వేగంగా పరివర్తన చెందుతుంది. వ్యాధి X 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొనే ప్రాణాంతక మహమ్మారికి దారితీసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బింగ్‌హామ్ ఇంతకుముందు మే నుండి డిసెంబర్ 2020 వరకు UK యొక్క వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షత వహించారు. ఆమె ఇలా చెప్పింది, “1918–19 ఫ్లూ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కనీసం 50 మిలియన్ల మందిని చంపింది, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే రెండు రెట్లు ఎక్కువ. ఈ రోజు, ఇప్పటికే ఉన్న అనేక వైరస్‌లలో ఒకదాని నుండి ఇలాంటి మరణాల సంఖ్యను మనం ఆశించవచ్చు.
UK వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చైర్ డేమ్ కేట్ బింగ్‌హామ్ ప్రకారం, ఈ వ్యాధి కరోనా కంటే 7 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీని గురించి ప్రజలను హెచ్చరించింది.
పెంపుడు జంతువుల ద్వారా వ్యాప్తి..!
ఈ ప్రపంచంలో ఏ వైరస్ గానీ.. ఏ వ్యాధి గానీ.. ముందుగా ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తాయి. అందులో ఎక్కువగా పెంపుడు జంతువుల నుంచి వ్యాప్తి జరుగుతుంది. అంటే మన ఇంట్లో ఉండే కుక్కలు.. పిల్లులు.. ఎలుకలు, గుర్రాలు ఇలా చాలా రకరకాల జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. వాటి యజమానులకు వాటి ద్వారానే ఈ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని WHO హెచ్చరిస్తుంది. వీలైనంత వరకు పెంపుడు జంతువులకు దూరంగా ఉండటమే ఉత్తమం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
S.SURESH