Khammam Tribal : ఖమ్మంలో పోడు భూముల వివాదం కలకలం.. పోలీసులు తరిమి తరిమి కొట్టిన గిరిజనులు

తెలంగాణలో మరో సారి పోడు భూమల వివాదం కలకలం.. ఖమ్మం - సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

తెలంగాణలో మరో సారి పోడు భూమల వివాదం కలకలం.. ఖమ్మం – సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు వచ్చిన పోలీసుల ప్రాణం మీదకు వచ్చింది. సత్తుపల్లి సీఐ కిరణ్ ఆధ్వర్యంలో గిరిజనుల మధ్య గొడవను పరిష్కరించడం వచ్చారు. ఇరువర్గాల మధ్య సమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో ఓ గిరిజన వర్గం పెద్ద పెద్ద కర్రలతో పోలీసులపై దాడికి పాల్పడారు.

దీంతో కొంతమంది పోలీసులు అటవీ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతుండగా.. గిరిజనులు వారి వెంటపడి మరి కర్రలతో.. రాళ్లతో దాడులకు దిగారు. అక్కడే సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు అధికారిని వెంటపడి.. బైక్ పై నుంచి కిందపడేసి గిరిజనులందరు గుంపుగా వచ్చి సివిల్ డ్రాస్ అధికారి పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. పోలీసులు గిరిజనులకు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయ్యలేక చేతులేత్తేశారు. ఈ ఘటనలో గిరిజను దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రెండు గిరిజనుల వర్గాల మధ్య ఎందుకు వివాదం వచ్చిందో అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

SURESH.SSM