MP Asaduddin Slogan : అసద్ పై అనర్హత వేటు ? జైపాలస్తీనా నినాదం కొంప ముంచుతుందా ?

MIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ పై అనర్హత వేటు పడుతుందా... ఇప్పుడు ఇదే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎంపీగా లోక్ సభలో ప్రమాణం స్వీకారం చేసిన అసదుద్దీన్... చివర్లో జై భీమ్.... జై తెలంగాణతో పాటు... జై పాలస్తీనా నినాదం చేయడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు

 

 

 

MIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ పై అనర్హత వేటు పడుతుందా… ఇప్పుడు ఇదే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎంపీగా లోక్ సభలో ప్రమాణం స్వీకారం చేసిన అసదుద్దీన్… చివర్లో జై భీమ్…. జై తెలంగాణతో పాటు… జై పాలస్తీనా నినాదం చేయడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. జై శ్రీరామ్ అంటూ అసద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్… జై పాలస్తీనా నినాదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ అసద్ ని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే… నిబంధనల ప్రకారం మళ్ళీ ప్రమాణం చేయించాలని మరికొందరు కోరుతున్నారు. బీజేపీ మాత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అసదుద్దీన్ పై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి కంప్లయింట్ ఇచ్చారు.

ఇజ్రయెల్ – పాలస్తీనా మధ్య గత కొంతకాలంగా వార్ జరుగుతోంది. ఈ యుద్ధం ఆగిపోవాలని భారత్ కోరుకుంటున్నా… ఇజ్రాయెల్ కే మన సపోర్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న అసద్… గత కొంతకాలంగా పాలస్తీనాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. చివరకు 18వ లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసినప్పుడు కూడా జై పాలస్తీనా అంటూ స్లోగన్ ఇవ్వడం వివాదస్పదమైంది. అసద్ మాత్రం తన స్లోగన్ ని సమర్థించుకుంటున్నారు. పాలస్తీనా గురించి మహాత్మాగాంధీ ఏమన్నారో తెలుసుకోండి… పాలస్తీనియన్లను అణచివేస్తున్నారు. రాజ్యాంగంలో ఎక్కడా అలా నినాదాలు చేయొద్దనే నిబంధన లేదని వాదించారు. అసద్ ఎప్పుడూ భారత జెండాని గౌరవించరు… భారత మాతకు జై కొట్టరు… అలాంటిది వేరే దేశానికి ఎలా విధేయత చూపుతారని బీజేపీ ప్రశ్నిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102d ప్రకారం అసద్ పై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది.

దీనిపై ఇప్పటికే మంత్రి కిరణ్ రిజిజుకి కంప్లయింట్ కూడా వెళ్ళింది. 102 ఆర్టికల్ ఎంపీలపై అనర్హత వేటుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అందులో సబ్ క్లాజ్ d ప్రకారం… ఏ సభ్యుడైనా ఇతర దేశాలకు విధేయత చూపినా… అతను భారతీయ పౌరుడు కాకపోయినా… ఒకవేళ భారతీయ సభ్యత్వాన్ని స్వచ్ఛంధంగా వదులుకున్నా డిస్ క్వాలిఫై చేయొచ్చని ఉంది. దీని ప్రకారమే బీజేపీ లీడర్లు ఒవైసీపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.