Tillu Square review : టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

రెండేళ్ళ క్రితం డిజే టిల్లు (DJ Tillu) తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమా కి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ తో ఆల్ రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు.

రెండేళ్ళ క్రితం డిజే టిల్లు (DJ Tillu) తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమా కి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ తో ఆల్ రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు. మరి ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… రాధిక (Radhika) ఎపిసోడ్ తర్వాత టిల్లు జీవితంలోకి లిల్లీ వస్తుంది. ఒక పబ్బులో ఇద్దరూ కలుస్తారు. ముందు మాట మాట కలిశాయి. ఆ తర్వాత పెదవులు కలిశాయి. ముద్దుల తర్వాత ఇద్దరూ గదిలోకి వెళ్తారు. తెల్లారేసరికి ఒక లెటర్ పెట్టేసి వెళ్లి మాయం అయిపోతుంది. ఆమె ఆలోచనలతో ఎక్కడ ఉందోనని వెతకడం మొదలుపెడతాడు టిల్లు. నెల తర్వాత ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది లిల్లీ. పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకువస్తాడు. సరిగ్గా టిల్లు బర్త్ డే రోజు వెళ్లి తన ఇంటికి పిలుస్తుంది. అక్కడికి వెళితే… అది రాధిక ఫ్లాట్. రోహిత్ ఎక్కడ అయితే చనిపోయాడో అదే ఫ్లాట్. అన్నయ్య రోహిత్ సంవత్సరం నుంచి కనిపించడం లేదని, అతడిని వెతకడంలో సాయం చేయమని టిల్లూను కోరుతుంది లిల్లీ. ఆ తర్వాత ఏం జరిగింది ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ కు, టిల్లు జీవితానికి సంబంధం ఏమిటి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల ఎంపిక…

జస్ట్ హీరో క్యారెక్టర్ మీదే నడిచిన పార్ట్ 1 కి ఏమాత్రం తీసి పోని విధంగా టిల్లు స్క్వేర్ (Tillu Sequel) కూడా కంప్లీట్ గా సిద్దు జొన్నలగడ్డ స్క్రీన్ (Siddu Jonnalagadda) ప్రజెన్స్ అండ్ క్యారెక్టర్ మీదే నడుస్తుంది. హీరో సింగిల్ లైన్ పంచుల వర్షం కురిపించగా అవన్నీ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. అనుపమ రోల్ గ్లామరస్ గా ఉండగా ఉన్నంతలో బాగా నటించింది అనుపమ (Anupama Parameshwar)… కానీ పార్ట్ 1 రేంజ్ లో హీరో హీరోయిన్స్ ల కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు ఏమో అనిపించింది, కానీ పర్వాలేదు. అతిథి పాత్రలో రాధికగా నేహా శెట్టి కనిపించారు. రాధిక నుంచి ప్రేక్షకులు కోరుకునే మూమెంట్స్ ఆమె ఎంట్రీ సీన్ ఇస్తుంది. బ్లాక్ శారీలో బ్యూటిఫుల్‌గా కనిపించారు. టిల్లు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్, మార్కస్ పాత్రలో ప్రణీత్ రెడ్డి (Praneet Reddy) నవ్వించారు. ప్రిన్స్, మురళీ శర్మ పాత్రలు కథలో పరిమితమే.

సాంకేతిక వర్గం… టిల్లు నుంచి ఆశించే కామెడీ ఇవ్వడంలో సక్సెస్ అయిన దర్శక రచయితలు… కథ పరంగా సర్‌ప్రైజ్ చేయడం, టెన్షన్ బిల్డ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు.మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేశాయి. ఎట్ ద సేమ్ టైమ్… ఇంటర్వెల్ దగ్గర అనుపమకు ఇచ్చిన ఆర్ఆర్, రాధిక రీ ఎంట్రీ & క్లైమాక్స్‌లో ఆర్ఆర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి రావడం ఖాయం.