DK is spinning the wheel. Telangana Congress candidates for Karnataka..!?
తెలంగాణలో ఎన్నికలు ఇలా ముగిశాయోలేదు అలా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు వాళ్ల అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డారు. గెలిచే అవకాశం ఉన్న అందరు అభ్యర్థులను సేఫ్‌జోన్‌లో ఉంచుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశమున్న అందరు అభ్యర్థులను కర్నాటకకు తరలిస్తున్నట్టు సమాచారం. ప్రారంభంలో కాస్త డీలా పడ్డా.. ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రజల్లో ఊహించని ఆదరణని మూటగట్టుకుంది. అదే ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ ఐనట్టు తెలుస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటి వరకూ వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా అంతా చెప్పింది.. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది అని. హ్యాట్రిక్ చాన్స్ కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్‌ను ఇది టెన్షన్ పెట్టే అంశం.
TS EXIT POLLS: కాంగ్రెస్‌కే మొగ్గు.. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే..!
మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ తమలో చేర్చుకున్నా.. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలు పార్టీ మారడం చాలా కామన్. 2014లో 2018లో కూడా కాంగ్రెస్‌లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు తరువాత బీఆర్‌ఎస్ పార్టీకి మారారు. ఇప్పుడు ఆ తప్పు మళ్లీ జరగకుండా కాంగ్రెస్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశమున్ని అభ్యర్థులందరినీ కర్నాటకకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చూసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు సరే.. కానీ డిసెంబర్ 3న అదే రిజల్ట్ వస్తుందా లేదా చూడాలి.