DK Shivakumar: మొదటిరోజే ఆరు గ్యారెంటీల హామీలపై సంతకం చేస్తాం: డీకే శివకుమార్

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ప్రధాని మోదీయే.. అవినీతి సీఎం కేసీఆర్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను శాశ్వతంగా ఫాంహౌజ్‌లో ఉంచాలి.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 05:21 PM IST

DK Shivakumar: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే.. హామీ ఇచ్చినట్లుగా ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తామని చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. “ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ మాట తప్పారు.

Priyanka Gandhi Vadra: బీఆర్‌ఎస్‌‌ను చూసేది మ్యూజియంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ప్రధాని మోదీయే.. అవినీతి సీఎం కేసీఆర్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను శాశ్వతంగా ఫాంహౌజ్‌లో ఉంచాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని సీపీఐ, వైఎస్సార్టీపీ మద్దతిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ ఒక టీంను పంపించండి. మీకే తెలుస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మీరంతా సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ కూడా గెలుస్తాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం. మొదటిరోజే ఈ హామీలపై సంతకం చేస్తాం. ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఒక దళితున్ని కూర్చోబెట్టిన ఘతన కాంగ్రెస్‌ది.

పదేండ్లు అధికారంలో ఉండి కూడా.. ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆ్ ప్రభుత్వం మనకు అవసరమా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ఎలా ఉండేదో.. త్వరలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అలాగే మారుతుంది” అని డీకే వ్యాఖ్యానించారు.