Skitha Sabharwal : దివ్యాంగులకు ఆ ఉద్యోగం అవసరమా! వివాదంలో స్మితా సబర్వాల్‌

తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్‌ ఉన్న ఐఏఎస్‌ అధికారుల్లో స్మితా సబర్వాల్‌ ఫ్రంట్‌ లైన్‌లో ఉంటారు. అదే రేంజ్‌లో వివాదల మధ్య కూడా ఉంటారు.

తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్‌ ఉన్న ఐఏఎస్‌ అధికారుల్లో స్మితా సబర్వాల్‌ ఫ్రంట్‌ లైన్‌లో ఉంటారు. అదే రేంజ్‌లో వివాదల మధ్య కూడా ఉంటారు. కాంట్రవర్సీని ఆమె టార్గెట్‌ చేస్తారో.. లేక కాంట్రవర్సీలే ఆమె వెంట ఉంటాయో తెలియదు కానీ.. స్మిత ఏం మాట్లాడినా ఏం చేసినా కచ్చితంగా అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతోంది ఈ మధ్య. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఆఫీసర్‌.. ప్రభుత్వం మారిపోయిన తరువాత ఏమాత్రం ఇంపార్టెన్స్‌ లేని శాఖకు బదిలీ అయ్యారు.

ఇప్పుడు ఇమె చేసిన ఓ కాంట్రవర్షల్‌ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కారు స్మితా.. పరిపాలనలో ఎంతో కీలకంగా వ్యవహరించే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఓఎస్‌ పోస్టులకు దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించారు స్మిత. క్షేత్ర స్థాయిలో పని చేసే అధికారులు దివ్యాంగులైతే సర్వీస్‌ ఏం బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ దివ్యాంగులు ఫ్లైట్‌ నడుతుపుతున్నాడు అంటే ప్రయాణికులు సేఫ్‌గా ఫీల్‌ అవుతారా.. ఓ దివ్యాంగుడైన డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తాడు అంటే పేషెంట్లు చేయించుకుంటారా అంటూ పోస్ట్‌ చేశారు. వాళ్ల విషయంలో ఉన్న జాగ్రత్త జిల్లాను నడిపించే అధికారుల విషయంలో ఎందుకని ప్రశ్నించారు. దివ్యాంగులకు డెస్క్‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఖచ్చితంగా ఇవ్వాలి కానీ క్షేత్ర స్థాయికి వెళ్లి చేసే ఉద్యోగాల్లో అవసరం లేదని అన్నారు.

ఇక ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ విషయం తేల్చకుండా UPSC మనోజ్‌ సోనీ రాజీనామా చేయడాన్ని తప్పుబట్టారు. నిజానిజాలు తేల్చకుండా ఒక అధికారి ఎలా చేతులు ఎత్తేస్తారంటూ ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాల అధికారుల పిల్లలకు మెరిట్‌ లేకున్నా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నారు ఇది కరెక్టేనా అడిగిన ఓ నెటిజన్‌కు స్మితా రిప్లై ఇచ్చారు. ఇలా రిజర్వేషన్లో ఉద్యోగాలు ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనంటూ చెప్పారు. జస్ట్‌ ఆస్కింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో స్మిత చేసిన ఈ పోస్ట్‌లు కామెంట్‌లు ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌ అవుతున్నాయి.