BABU CHALLENGE : చర్చకు దమ్ముందా ? జగన్ కు బాబు సవాల్

అసెంబ్లీ ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండటంతో ఏపీలో పొలిటికల్ (AP Politics) హీట్ పెరుగుతోంది. గుంటూరు కారం సినిమాతో ఫేమస్ అయిన మడతపెట్టి టాపిక్ మీద గత వారం రోజులుగా టీడీపీ, వైసీపీ (YCP) అధినేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఎవరిది అభివృద్ది.... ఎవరిది విధ్వంసం తేల్చుకుందాం రమ్మంటూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు... సీఎం జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండటంతో ఏపీలో పొలిటికల్ (AP Politics) హీట్ పెరుగుతోంది. గుంటూరు కారం సినిమాతో ఫేమస్ అయిన మడతపెట్టి టాపిక్ మీద గత వారం రోజులుగా టీడీపీ, వైసీపీ (YCP) అధినేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఎవరిది అభివృద్ది…. ఎవరిది విధ్వంసం తేల్చుకుందాం రమ్మంటూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బూటకపు ప్రసంగాలు కాదు.. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్దమా జగన్..? ఎవరి పాలన స్వర్ణయుగమో..? ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం..? ఎనీ టైమ్… ఎనీ సెంటర్… చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ X లో ట్వీట్ చేశారు చంద్రబాబు.

రాప్తాడు సిద్దం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు X లో కౌంటర్ ఇచ్చారు. జగన్ తో బహిరంగ చర్చకు సిద్దమంటూ సవాల్ చేశారు. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్దమని ప్రకటించారు. సిద్దం అని సభలు పెట్టి.. అశుద్దం మాటలు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగనుకు రాజకీయంగా చివరి ఛాన్స్… వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టాడన్నారు బాబు. మిగిలిన వాళ్లను 50 రోజుల్లో జనం మడత పెడతారని బాబు చెబుతున్నారు.

జనానికి 10 రూపాయలు ఇచ్చి… వంద దోచిన జగన్… సంక్షేమం గురించి చెప్పడమా అని ఎద్దేవా చేశా బాబు. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఏ ఊరుకెళ్లినా జగన్ 5 ఏళ్ల పాలనా విధ్వంసం కనిపిస్తోంది. సహజ వనరుల దోపిడీ.. స్కాం కోసమే స్కీం పెట్టడం జగన్ విధానమని బాబు మండిపడుతున్నారు. అత్యంత ధనిక సీఎంగా మారిన జగన్.. పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది..? సామాజిక ద్రోహం చేసి… సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదంటున్నారు బాబు. ఎన్నికల్లో జగన్ బాధిత ప్రతి కుటుంబం కూడా వైసీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినరే. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణీకులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ, స్కూల్ బస్సుల్ని లాక్కొన్నారు. జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారని బాబు ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో పెత్తందారు జగన్ కు… 5 కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారనీ… జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయల దాకా నిధులను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు చంద్రబాబు. జగన్ రెడ్డి పేరు చెబితే… బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి శీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్ ప్రోకో, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా గుర్తొస్తాయి. జగన్ పేరు చెబితే… అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తొస్తాయి. మేనిఫెస్టోలో పెట్టిన మద్య నిషేధం ఏమైంది..? అంటూ సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు టీడీపీ అధినేత. మరి బాబు సవాల్ ను జగన్ స్వీకరిస్తారా… నిజంగా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుందా… లేకపోతే ఎన్నికల ప్రచార సవాళ్ళుగానే మిగిలిపోతాయా అన్నది చూడాలి.