RAMOJI ASSETS : రామోజీ ఆస్తి ఎన్ని వేలకోట్లు తెలుసా ? ఆ ఆస్తి ఎవరికి చెందుతుందంటే

సామాన్యుడు నుంచి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీరావు ఎన్నో రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. జర్నలిజం(Journalism), సినిమా, వినోదం, చిట్ ఫండ్స్ (Chit Funds), ఫుడ్స్, హోటల్స్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ చేశారు. ఆ వ్యాపారాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు.

 

సామాన్యుడు నుంచి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీరావు ఎన్నో రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. జర్నలిజం(Journalism), సినిమా, వినోదం, చిట్ ఫండ్స్ (Chit Funds), ఫుడ్స్, హోటల్స్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ చేశారు. ఆ వ్యాపారాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. బిజినెస్ (Business) మ్యాన్ గా, పత్రికా అధిపతిగా, నిర్మాతగా 50యేళ్ళకు పైగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు రామోజీ రావు. అయితే ఆయన పేరున ఆస్తి ఎంత ఉంటుందని హాట్ టాపిక్ నడుస్తోంది.

రామోజీరావు (Ramoji Rao) వ్యాపారం మొదలుపెట్టిన టైమ్ లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ‌ లో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా సిటీల్లో ఆస్తులు కొన్నారు. ఆ స్థిరాస్తులే ఆ తరువాత వేల కోట్లకు చేరాయి. హైదరాబాద్ శివారుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ పేరుతో దేశంలోనే అతి పెద్ద స్టుడియో నిర్మించారు. దీని విస్తీర్ణం 16 వందల 66 ఎకరాలు. నిర్మాత ఎవరైనా ఇక్కడికి సూట్ కేసులో డబ్బులు తీసుకొస్తే… ఫిల్మ్ రీల్ తో బయటకు వెళ్ళొచ్చని అంటారు. అంటే సినిమాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, టెక్నాలజీని ఫిల్మ్ స్టుడియోలో అందుబాటులోకి తెచ్చారు. ఇది గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కింది.

హైదరాబాద్ లో భూముల రేట్లు పెరగడంతో… రామోజీ ఫిల్మ్ స్టుడియో (Ramoji Film Studio) స్థలం విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుంది. రామోజీరావుకి నికర ఆస్తులు వేల కోట్లల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు దాదాపు 46 వేల కోట్ల రూపాయల దాకా అసెట్స్ ఉంటాయని అంటున్నారు. ఇందులో తన ఇద్దరు కొడుకులు ఇద్దరికీ సమానంగా కొంత భాగాన్ని గతంలోనే పంచేశారు. తన కొడుకులు, కోడళ్ళల్లో ఒక్కో సంస్థ బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పజెప్పేశారు రామోజీరావు. మిగిలి ఆస్తులు తన భార్య రమాదేవి పేరున ఉంచిన్నట్టు సమాచారం. వాటిపై అధికారం ప్రస్తుతానికి ఆమెకు ఉంది. రమాదేవి తదనంతరం ఆ ఆస్తులు తన పిల్లలకు చెందేలా రామోజీరావు వీలునామా రాశారని అంటున్నారు.