Tiger Cubs: తల్లికి దూరమైన పులి పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా..?

అమ్మ ప్రేమ అందరికీ సమానమే. అది మనుషులైనా జంతువులైనా అమ్మ ప్రేమలో తేడా ఉండదు. చిన్నతనంలో ప్రతీ జీవి తల్లి సంరక్షణలో ఉండాల్సిందే. అలాంటి పసితనంలోనే తల్లిని కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 12:31 PM IST

అలాంటి బాధను అనుభవిస్తూనే పెరిగి పెద్దయ్యాయి ఈ పులి పిల్లలు. రెండు నెలల క్రితం నంద్యాలలో దొరికిన పులి పిల్లలు గుర్తున్నాయా. అప్పుడు చాలా వీక్‌గా.. అసలు బతుకుతాయో లేదో అన్న స్థితిలో ఉన్న కూనలే ఇవి. చూశారా ఎంత హెల్దీగా ఎనర్జీగా ఉన్నాయో. తల్లి ప్రేమ దూరమైనా పులి పిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడారు అటవీశాఖ అధికారులు. రెండు నెలల క్రితం నంద్యాలలో తల్లి పులి నుంచి ఈ పులి పిల్లలు తప్పిపోయాయి. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు వీటిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లి పులిని కనిపెట్టి ఎలాగైనా పిల్లలను తల్లి దగ్గరికి చేర్చాలని అనుకున్నారు.

కానీ అప్పటికే తల్లి పులి చనిపోయింది. పిల్లల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. తల్లి దూరమవ్వడంతో పాలు కూడా తాగలేదు ఈ పిల్లలు. శారీరకంగా చాలా బలహీణంగా ఉన్న ఈ పిల్లలను అటవీశాఖ అధికారులు చాలా జాగ్రత్తగా కాపాడారు. ట్రీట్‌మెంట్ చేయించి మంచి ఆహారం అందించారు. ఒక్కో పులి పిల్లకు 100 గ్రాముల బాయిల్డ్ చికెన్, 20 గ్రాముల బాయిల్డ్ లివర్ తోపాటు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించిన మిల్క్ పౌడర్ మిక్స్ ను మోతాదుకు తగ్గట్టుగా ఇచ్చారు. పులిపిల్లలు అన్నట్టు కాకుండా పెంపుడు జంతువుల్లా వీటిని చూసుకున్నారు. దీంతో ఈ పిల్లలు చాలా హెల్దీగా తయారయ్యాయి. ప్రస్తుతం ఒక్కొక్కటి 20 కిలోల బరువు పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇవి ఆరోగ్యంగా ఉండటంతో కెనెల్‌ నుంచి బయటికి వదిలిపెట్టారు. చాలా కాలం తరువాత స్వేచ్ఛ లభించడంతో పులి పిల్లలు ఎలా గెంతులు వేస్తున్నాయో చూడండి.