MISS WORLD KRYSTYNA : మిస్ వరల్డ్ క్రిస్టినా బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

మిస్ వరల్డ్ పోటీలకు (Miss World Pageants) ఈసారి ఇండియాలో జరిగాయి. ముంబైలో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచ సుందరి టైటిల్ ను చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా గెలుచుకుంది. 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా... టాప్ 4 నిలిచిన క్రిస్టినా పిస్కోవా చివరకు మిస్ వరల్డ్ కిరీటం (World crown) దక్కించుకుంది.

మిస్ వరల్డ్ పోటీలకు (Miss World Pageants) ఈసారి ఇండియాలో జరిగాయి. ముంబైలో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచ సుందరి టైటిల్ ను చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా గెలుచుకుంది. 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా… టాప్ 4 నిలిచిన క్రిస్టినా పిస్కోవా చివరకు మిస్ వరల్డ్ కిరీటం (World crown) దక్కించుకుంది. ఎవరీ క్రిస్టీనా (Miss World Christina) అని ఇప్పుడు అందరూ నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

క్రిస్టినా అందానికే కాదు… ఆమె మంచి మనసుకు కూడా నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో సేవలు చేస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులు చదువుకు దూరం అవ్వొద్దని టాంజానియాలో ఓ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో ఉచితంగా ఎందరో పేద పిల్లలకు చదువులు నేర్పిస్తోంది. తన లైఫ్ లో ప్రౌడ్ గా ఫీలయ్యే మూవ్ మెంట్… స్కూల్ ప్రారంభించడమే అంటోంది క్రిస్టినా. ఫౌండేషన్ స్థాపించాక తాను కూడా వాలంటరీ వర్కర్ గా అందులో పనిచేస్తోంది. 2022లో లండన్ లోని ఎలైట్ మోడల్ మేనేజ్ మెంట్ లో చేరింది. అదే ఏడాది నిర్వహించిన మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. మిస్ వరల్డ్ విన్నర్ క్రిస్టినాకు మోడలింగ్ అంటే ఇష్టం. లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ లో డిగ్రీలు పూర్తి చేశాక… మోడలింగ్ వైపు టర్న్ అయింది.

క్రిస్టినా మిస్ వరల్డ్ కిరీటం గెలవకముందు కొన్ని క్షణాల ముందు కూడా తన సేవా కార్యక్రమం గురించి చెప్పిన నాలుగు మాటలతో ఆమెకు విజయం ఖాయమైంది. తాను అందాల పోటీల్లో గెలిచినా… గెలవకపోయినా… పిల్లల చదువుల కోసం కష్టపడుతూనే ఉంటానని చెప్పింది. ఆ మాటలతో ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది. క్రిస్టినా ఇంగ్లీష్, పోలిష్, స్లోవక్, జర్మనీ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ఫ్లూట్ ప్లే చేయడం అంటే ఎంతో ఇష్టం. మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోకి అందమే కాదు… తన సేవా కార్యక్రమాలతో మంచి మనసు కూడా ఉందని నిరూపించింది.