బాక్సింగ్ డే టెస్ట్, దీని చరిత్ర ఏంటో తెలుసా ?

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్టుగా కూడా పిలుస్తారు..అసలు బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటి... దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం... క్రిస్మస్ తర్వాత రోజుని సాధారణంగా బాక్సింగ్ డే అంటారు.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 12:58 PM IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్టుగా కూడా పిలుస్తారు..అసలు బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటి… దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం… క్రిస్మస్ తర్వాత రోజుని సాధారణంగా బాక్సింగ్ డే అంటారు.ఇది గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడా వంటి దేశాలలో జరుపుకొంటారు. అలాగే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. బాక్సింగ్ డే గురించి చాలా కథలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో 1800లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అధిష్ఠించిన రోజును బాక్సింగ్‌ డే అని కూడా అంటారు. మరో కథ ప్రకారం.. క్రిస్మస్రోజు సెలవు తీసుకోకుండా పని చేసే ఉద్యోగులకు మరుసటి రోజు బాక్స్ రూపంలో బహుమతి ఇస్తారు. ఈ రోజున వారికి సెలవు కూడా ఇస్తారు. అందుకే బాక్సింగ్ డే అని పిలుస్తారనేది కథ.

బాక్సింగ్-డే టెస్ట్ మ్యాచ్ మొదట 1950లో ప్రారంభమైంది. మొదట్లో ప్రతి సంవత్సరం ఆడేవారు కాదు. తర్వాత ప్రతి ఏటా ఈ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ తొలిసారి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1952లో తొలిసారి బాక్సింగ్ డే టెస్టు ఆడిన దక్షిణాఫ్రికా ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. తర్వాత 1968లో ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడారు. అప్పటి నుండి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా బాక్సింగ్ డేలో నిరంతరం టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 26 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా జరగబోతోంది.

ఇదిలా ఉంటే భారత్, ఆసీస్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కు క్రేజ్ మామూలుగా లేదు. దాదాపు 15 రోజుల ముందే ఈ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. బాక్సింగ్‌ డే టెస్ట్‌ జరుగబోయే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ కెపాసిటీ 90000.. కాగా తొలి రోజు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ వేదికపై చివరి పర్యటనలో భారత్‌ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. అందుకే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.