ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 నాణెంను ముద్రించిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిని కొనుగోలు చేసే ప్రక్రియతో పాటూ ధరను తాజాగా ప్రకటించింది. ఈ నాణెం మూడు రకాలా ప్యాకింగ్ లో అందుబాటులో ఉంది.
ఆసక్తికలిగిన వారు ఇండియా గవర్నమెంట్ మింట్ అనే వెబ్ సైట్ ద్వారా అన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం https://www.indiagovtmint.in/en/commemorative-coins/ లో లాగిన్ అయి కొనుగోలు చేయవచ్చు. ఇందులో 50శాతం వెండి, 5శాతం రాగి, 5శాతం నికెల్ మిశ్రమంతో తయారు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్లోని సైఫాబాద్, చెర్లపల్లి మింట్ విక్రయ కేంద్రాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఛీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక్కడికి నేరుగా వచ్చి కూడా కొనుగోలు చేయవచ్చు అని సూచించారు. ఈ సందర్భంగా ఒక సందేశాన్ని కూడా జోడించారు. ‘జాతి చరిత్రపై చెరగని ముద్రవేసిన దిగ్గజ వ్యక్తులకు నివాళులర్పిస్తూ ఇలాంటి స్మారక నాణేలను ముద్రిస్తారు. ఈ నాణెం ఎన్టీఆర్ అసాధారణ సేవలకు నివాళులర్పిస్తుంది. ఆయన అభిమానులు నాణేన్ని సొంతం చేసుకొని చారిత్రక ఘట్టంలో భాగస్వాములు కావాలి’ అన్నారు.
T.V.SRIKAR