Donald Trump: సంపదలో దూసుకెళ్లిన ట్రంప్.. ఎన్నివేల కోట్లు పెరిగిందంటే..

29 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ట్రంప్ సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్‌ సోషల్‌’ విలీన ప్రక్రియ కూడా పూర్తైంది. ట్రూత్‌ సోషల్‌’ సంస్థ డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌ (డీడబ్ల్యూఏసీ)లో విలీనమైంది. అయితే, ఈ కంపెనీ షేర్లను నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాలి.

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 06:42 PM IST

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ట్రంప్ స్థానం సంపాదించారు. అంతేకాదు.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక భారీ బిజినెస్ డీల్ కూడా సెట్టయ్యింది. దీంతో ట్రంప్‌నకు గుడ్ టైం నడుస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం.. ట్రంప్‌ సంపద విలువ 4 బిలియన్‌ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి, 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.

KTR on Media: 16 మీడియా సంస్థలపై KTR ఫ్యామిలీ కేసులు !

అలాగే 29 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ట్రంప్ సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్‌ సోషల్‌’ విలీన ప్రక్రియ కూడా పూర్తైంది. ట్రూత్‌ సోషల్‌’ సంస్థ డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌ (డీడబ్ల్యూఏసీ)లో విలీనమైంది. అయితే, ఈ కంపెనీ షేర్లను నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాలి. రెండు కంపెనీల విలీనం తర్వాత నాస్‌డాక్‌లో డీజేటీ పేరిట కొత్త కంపెనీగా ట్రేడింగ్ కానుంది. దీంతో కంపెనీ షేర్లు కూడా భారీగా పెరిగాయి. దాదాపు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్ సంపద ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. నిజానికి ట్రంప్ కొంతకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తన సంపద గురించి గతంలో అసత్యాలు చెప్పిన కేసులో కోర్టు ఆయనకు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) భారీ జరిమానా విధించింది. ఈ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్‌ ఇటీవల న్యూయార్క్‌ అప్పీల్స్‌ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన కోర్టు ఒక కండిషన్ పెట్టింది. కింది కోర్టు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) జరిమానా తగ్గించాలంటే.. పది రోజుల్లో రూ.1,460 కోట్ల (17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని సూచించింది. అలా చేస్తే.. రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అటు తన కంపెనీ డీల్ పూర్తవ్వడం.. షేర్ల విలువ పెరగడం.. మరోవైపు కోర్టులో ఊరట లభించడం వల్ల ట్రంప్ సంపదలో భారీ పెరుగుదల కనిపించనుంది.