బుధవారం ఈ పనులు అస్సలు చేయొద్దు… చేస్తే అడ్డంకులను ఆహ్వానించనట్టే..

ఏ పని చేయాలన్న వారం, వర్జ్యం చూసుకోమని పెద్దలు చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తారో చాలా మందికి తెలియదు. కానీ.. దాని వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆ పద్ధతులు ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం.

  • Written By:
  • Publish Date - December 18, 2024 / 12:54 PM IST

ఏ పని చేయాలన్న వారం, వర్జ్యం చూసుకోమని పెద్దలు చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తారో చాలా మందికి తెలియదు. కానీ.. దాని వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆ పద్ధతులు ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే.. బుధవారం కూడా కొన్ని పనులు చేయకూడదని అంటున్నారు… అవి ఏంటి…? ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం.

బుధవారం.. అంటే వినాయడికి ప్రీతికరమైన రోజు. శాస్త్రం ప్రకారం… బుధగ్రహానికి సంబంధించిన రోజు కూడా. గణపయ్యకు, బుధగ్రహానికి సంబంధించిన ఆ రోజున కొన్ని పనులు చేయొద్దని మతగ్రంథాలు చెప్తున్నాయి. వాటిని నమ్మకుండా… చేయొద్దన్న పనులు చేస్తే… ఆర్థిక ఇబ్బందులు, పేదరికం ఎదుర్కోక తప్పదట. అందుకే పెద్దలు చెప్పిన మాట.. చద్దన్నం మూట అంటారు. వారు ఏది చెప్పినా మన మంచికి చెప్పారనే భావించాలి… అర్థం తెలియకపోయినా… అందులో పరమార్థం ఉంటుందని నమ్మి ముందడుగు వేయాలి. బుధవారం ఏ పనులు చేయకూడదు.. ఎందుకు చేయకూడదో తెలుసా.

బుధవారం రోజు గణనాథుడిని పూజిస్తారు హిందువులు. ఆరోజున గణపయ్యను ఆరాధిస్తే… వారి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయట. అంతేకాదు… వినాయకుడికి ఇష్టమైన పనులు చేస్తే.. ఆయన తొందరగా ప్రసన్నమవుతాడని భక్తుల నమ్మకం. అలాగే.. ఆయనకు ఇష్టం లేని పనులు చేస్తే.. ఆగ్రహిస్తాడట. అందుకే.. మతగ్రంథాల ప్రకారం… బుధవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదనే నిబంధన పెట్టుకున్నారట. ఆ పనులు చేస్తే… జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందట.

బుధవారం అంటే… గణపతి, బుధ గ్రహానికి సంబంధించిన రోజు. గణపతిని పూజిస్తే… చేపట్టిన పనుల్లో అడ్డంకులను తొలగిస్తాడట. అలాగే… బుధుడు తెలివితేటలు, వాక్కు గ్రహం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అందువల్ల బుధవారం ఎవరినీ దుర్భాషలాడవద్దు. డబ్బు లావాదేవీలు చేయకూడదు. బుధవారం రోజు రుణాలు ఇచ్చినా, తీసుకున్నా.. ఆర్థిక సమస్యలు వస్తాయట. అందువల్ల బుధవారం రుణం ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దని చెప్తున్నారు పండితులు. ప్రయాణాలకు సంబంధించి.. బుధవారం రోజు పడమర దిశలో వెళ్లకూడదు. నల్లటి దుస్తులు అస్సలు ధరించకూడదు. నల్లటి దుస్తులు ధరిస్తే… అది వైవాహిక జీవితంపై ప్రభావితం చూపుతుందట. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందట. ఇక.. ఆడవారిని అవమానించకూడదు. ఇంటి ముందుకు వచ్చే బిచ్చగాళ్లను, మూగజీవాలను తరిమికొట్టకూడదు. అలాచేస్తే.. బుధగ్రహం ఇచ్చే ఫలితం ప్రతికూలమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. బుధవారం రోజు పేదలు, మూగజీవాల ఆకలి తీరిస్తే.. శుభఫలితాలు ఉంటాయి. బుధవారం రోజు… జుట్టుకు సంబంధించిన ఏ వస్తువును కొనుగోలు చేయకూడదు. టూత్ బ్రష్ కూడా కొనకూడదు. పాలు ఉపయోగించే ఎలాంటి పదార్థాలను ఇంట్లో తయారుచేయకపోవడం ఉత్తమని అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు.

ఇక… బుధవారం కొన్ని పనులకు అనుకూలం కూడా. పెద్దవాళ్లతో మాట్లాడేందుకు బుధవారాన్ని అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలవాలనుకున్నా… మంచిదేనట. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారు.. బుధవారం అందుకు సంబంధించిన చర్చలు జరిపే శుభఫలితాలు లభిస్తాయట. సెటిల్‌మెంట్‌ వ్యవహారాలకు కూడా బుధవారమే ఉత్తమమైన రోజని చెప్తున్నారు.