Tollywood : టాలీవుడ్ కి దిక్కెవరు?

ఏదో చిరు వాల్తేర్ వీరయ్య 200 కోట్లు రాబట్టింది. బలగం, బేబీ లాంటి చిన్న సినిమాల సందడి పెరిగిందనే సంతోషం తప్ప 2023 లో తెలుగు సినిమా వెలుగులే లేవు. కాని జైలర్ తో కోలీవుడ్ ఊపేసింది. దసరాకు లియో రాబోతోంది.

2023 ని పూర్తిగా వదిలేసిన టాలీవుడ్ టాప్ స్టార్స్.

2023 మీద టాలీవుడ్ టాప్ హీరోలకు జాలి లేదా? సలార్ తో ఈ ఏడాది ప్రబాస్ దుమ్ముదులుపుతాడనుకుంటే, దసరా, దీపావళిని కూడా వదిలేసి, క్రిస్మస్ కి ఆ సినిమా వస్తుందన్నారు. చివరికి సంక్రాంతికే ఆ ఛాన్స్ అంటున్నారు. అలా చూస్తే ఈ ఏడాదిని ప్రభాస్ మిస్ చేసినట్టేనా?

జైలర్, జవాన్, పటాన్ లా మనదగ్గర సందడి ఏది?

ఆదిపురుష్ పంచ్ తో డీలా పడ్డ ఫ్యాన్స్ కి సలార్ కిక్ ఇస్తుందనుకుంటే షాక్ ఇచ్చింది. సరే ఇంకా పెద్ద హీరోలున్నారు కదా, వాళ్ల సినిమాలైన సందడి చేస్తాయనుకుంటే, మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సంక్రాంతికే వస్తుంది. బన్నీ, చెర్రీ, తారక్ వీల్ల సినిమాలేవీ ఈ ఏడాది రావటం కుదరదని తేలింది.

కాపాడేందుకు ఓజీగా వస్తున్న ఒకే ఒక్కడు పవన్.

ఏదో చిరు వాల్తేర్ వీరయ్య 200 కోట్లు రాబట్టింది. బలగం, బేబీ లాంటి చిన్న సినిమాల సందడి పెరిగిందనే సంతోషం తప్ప 2023 లో తెలుగు సినిమా వెలుగులే లేవు. కాని జైలర్ తో కోలీవుడ్ ఊపేసింది. దసరాకు లియో రాబోతోంది. ఇక బాలీవుడ్ లో పటాన్ లానే జవాన్ దుమ్ముదులుపుతోంది. ఎటొచ్చి టాలీవుడ్ మాత్రమే సైలెంట్ అవుతోంది. సరే పవర్ స్టార్ ఉన్నాడు కదా, క్రిస్మస్ కి ఓజీ తో వందలకోట్ల వరద తెస్తాడా అంటే, ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అంటున్నారు. భగవంత్ కేసరి అయినా వందలకోట్ల వరద తెస్తుందా.. అంటే టాలీవుడ్ వరకైనా నమ్మకం ఉంది. అనిల్ రావిపుడి మేకింగ్ కి ఆస్టామినా ఉంది. కాని పొరుగింట్లో వసూళ్లొస్తేనే ఐదారొందల కోట్ల రికార్డుల సాధ్యం.. సో ఎలా చూసినా పవన్ ఓజీ తప్ప టాలీవుడ్ ని ఆదుకునే మరో మూవీ కనుచూపు మేరకు కనిపించట్లేదు.