మీకు పిల్లలు లేరా…? అయితే వైజాగ్ లో కొనుక్కోవచ్చు…!

శిశువుల విక్రయాల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేసిన విశాఖ సిటీ పోలీస్ లు... మరో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 09:18 PM IST

శిశువుల విక్రయాల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేసిన విశాఖ సిటీ పోలీస్ లు… మరో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రా, ఓడిస్సా, తెలంగాణా, ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు ముఠా కార్యకలాపాలు విస్తరించినట్లు దర్యాప్తులో విశాఖ పోలీసులు గుర్తించారు. మరో అయిదుగురు చిన్నారులను రక్షించారు. ఇటీవల విశాఖలో ఓ చిన్నారిని విక్రయిస్తుండగా 9 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసులో మరింత లోతు విచారణకు సిట్ వేసారు నగర కమీషనర్. ఇప్పటివరకు 17 మంది నిందితులు అరెస్ట్ కాగా ఆరుగురు చిన్నారులను కాపాడారు. త్రీ టౌన్ తో పాటు గాజువాకలో మరో కేసు నమోదు అయింది. దీనిపై కమీషనర్ మాట్లాడుతూ పిల్లల విక్రయాల్లో అంతర్రాష్ట్ర ముఠా నెట్వర్క్ ఉంది అన్నారు. సంతానం లేని వారిని టార్గెట్ చేసి.. పేదలను డబ్బు ఆశ చూపి ట్రాప్ చేస్తుంది ముఠా అని వెల్లడించారు. విశాఖలో ఓ మహిళను విచారించాం.. ఆమె ఇన్ఫర్మేషన్ తో కూపిలాగాం అని తెలిపారు. ఒక్కో చిన్నారిని ఐదు నుంచి ఏడు లక్షల వరకు విక్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సెక్యూరిటీ పెంచాలని సూచించాం అని తెలిపారు.