సలహాలు ఇస్తే నలుగురు మెచ్చుకోవాలి.. లేదంటే ఓ నలుగురు అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలి. అసలు పని మాసేసి.. అంతంతం మాత్రం జ్ఞానం ఉన్న వాటిపై సలహాలు ఇస్తామంటే.. మొదటికే మోసం వస్తుంది. సమంత, నయనతార విషయంలో అదే జరిగింది. కాదు కాదు.. డాక్టర్ సమంత (Samantha), డాక్టర్ నయనతార (Nayanthara) విషయంలో అదే జరిగింది. చేసుకోవడానికి షూటింగ్‌లు.. చూసుకోవడానికి సినిమాలు చాలా ఉన్నా.. అనవసరమైన సలహాలు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారీ బ్యూటీస్. బుర్ర పాడు చేసే బోడి సలహాలు ఎందుకు.. అవసరమా మనకు ఇయన్నీ అంటూ ఇద్దరినీ ఆడుకుంటున్నారు నెటిజన్లు ఇప్పుడు. అసలేం జరిగిందంటే.. నయనతార ఇన్‌స్టా గ్రామ్‌లో హెల్త్ టిప్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. మందార టీతో చాలా లాభాలు ఉన్నాయని.. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని.. దీన్ని తీసుకుంటే రోగనిరోధక (Immune) పెరుగుతుందని రాసుకొచ్చింది. సీజనల్ ఇన్‌ఫెక్షన్ రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుందని… డయాబెటిస్ (Diabetes) నుంచి మొటిమల వరకు… ఎన్నింటికో ఈ టీ ఉపసమనాన్ని కలిగిస్తుందని తెప్పింది.
మందారం టీ (Hibiscus tea) ఎలా తయారుచేసుకోవాలో రెసిపీ కూ డా పంచుకుంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అయింది. డాక్టర్ సిరియాక్ (Dr. Cyriac) అబ్బి ఫిలిపిస్ అని ఓ హెపటాలజిస్ట్. కాలేయ వ్యాధుల్ని నయం చేసే డాక్టర్. మొన్నీ మధ్యే సమంతను ఆడుకున్నాడుగా అతనే ! ఎవరైనా సోషల్ మీడియాలో, మీడియాలో నోటికొచ్చిన వైద్య చిట్కాలు చెప్తే.. వెంటనే వాళ్లను ఎక్కేస్తాడు. మొన్న సమంత.. ఇప్పుడు నయన్ విషయంలో అదే చేశాడు. సమంత చెప్పిన మందార టీపై మరిగిపోయాడు. ఆ టీ కాస్త టేస్టీగా ఉంటుందని చెప్పి ఆపి ఉంటే పర్లేదని.. అవగాహన లేని చిట్కాలు ఎందుకు చెప్తున్నారంటూ ఫైర్ అయ్యాడీ లివర్ డాక్టర్. మధుమేహానికి మంచి రెమెడీ అని చెప్పి.. నయనతార తన ఆరోగ్య నిరక్షరాస్యతను చాటుకుంటున్నారని అన్నారు.
ఎవరో సెలబ్రిటీ న్యూట్రిషినిస్ట్ ప్రచారం ఇదంతా రాసుకొచ్చింది తప్ప.. అసలు ఏం తెలుసని నయనతార ఇలాంటి సలహాలు ఇస్తుందని నిలదీశాడీ డాక్టర్. ఐతే ఆయనకు నయతార కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తెలివితక్కువ వాళ్లతో మాట్లాడ్డం వేస్ట్ అంటూ ఓ పోస్ట్ పెట్టి కౌంటర్ ఇచ్చింది. మొన్నీ మధ్య సమంత కూడా ఇలాంటి సలహానే ఇచ్చి ముక్కు కాల్చుకుంది. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని సలహా ఇచ్చింది. అప్పుడు కూడా ఇదే లివర్ డాక్ ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు నయనతార కూడా ఇలాంటి బోడి సలహానే ఇచ్చి.. వివాదానికి కారణం అయింది. ఆ డాక్టర్ అన్నాడని కాదు కానీ.. నెటిజన్లు కూడా ఇద్దరు ముద్దుగుమ్మలపై ఇదే రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
ఎవరో అనామకుడు ఇలాంటి సలహా ఇచ్చాడంటే పర్లేదు.. పదిమందిని ఇన్‌స్పైర్ చేసే మీరు.. అసలు సంగతి తెలుసుకోకుండా ఇలాంటి సలహాలు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్లు.. ఎప్పుడు డాక్టర్లు అయిపోయారు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. సమంత, నయన్ ఆరోగ్య సలహాలు ఇవ్వడం అంటే.. ఫుట్‌బాల్ గేమ్‌లో వికెట్ కీపింగ్ చేసినట్లే అంటూ ఇంకొందరు ఆడుకుంటున్నారు. అయినా ఏదో నడుస్తోందిగా ఎందుకు మనకివ్వన్నీ.. అర్థం తెలియని సలహాలు.. ఆ తర్వాత కోపంతో అర్థం లేని పోస్టులు.. బోడి సలహాలు ఇవ్వడం ఎందుకు.. చేతులు కాల్చుకోవడం ఎందుకు.. ఫీల్ అవడం ఎందుకు.. ఆలోచించండీ బ్యూటీస్!