సినీ పరిశ్రమలో (Film Industry) మరో విషాదం… మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ (Pavitranath) మృతి చెందారు. గుండెపోటు (Heart Attack) తో చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా ద్వారా ఈ విషయం తెలిపారు. దయాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలి అంటూ ఆమె పోస్ట్ చేశారు.
బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ లో చక్రవాకం తర్వాత మొగలి రేకులు ఒకటి. మంజుల నాయుడు సీరియల్స్ కి అప్పట్లో జనం నుంచి ఫుల్ క్రేజ్ ఉండేది. మొగలి రేకులు సీరియల్ కొన్నేళ్లపాటు టీవీలో ప్రసారం అయింది. హయ్యస్ట్ రేటింగ్ కూడా ఉండేది. ఈ సీరియల్లోని పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యాయి. ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన కేరకర్టర్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. సీరియల్ లో ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు దయ. ఈ రోల్ ని పవిత్రనాథ్ పోషించాడు. అల్లరిగా, అమాయకంగా కనిపించే పాత్ర ఇది. సీరియల్ మధ్యలో దయ చనిపోవడంతో అతడి పాత్ర కూడా ఎండ్ అయింది. తర్వాత కొన్ని సీరియల్స్ లో చేసిన దయ.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా పోస్టుపై నెటిజన్స్ భారీగా స్పందిస్తున్నారు. దయ ఎలా చనిపోయాడు ? ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నారు.
రెండేళ్ళ క్రితం పవిత్రనాథ్ పై అతడి భార్య శశిరేఖ సంచలన ఆరోపణలు చేశారు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉందనీ.. ఇంటికి చాలా మందిని తీసుకొచ్చేవాడని తెలిపింది. ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని ఆరోపించింది. దీనిపై పవిత్రనాథ్ ఎప్పుడూ స్పందించలేదు. భార్య ఆరోపణలతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడని స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోయినట్టు మేఘన చెప్పడంతో ఫ్రెండ్స్ షాక్ లో ఉన్నారు. గుండె పోటు వచ్చినట్టు అంటున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.