Arunachal Pradesh, Heavy Rains : చిగురుటాకుల వణుకుతున్న అరుణాచల్ ప్రదేశ్…

అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనే జిల్లాలో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగి పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.

అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనే జిల్లాలో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగి పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. భారీ వర్షాలకు ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకర స్తాయికి మించి ప్రవహిస్తున్నాయి.

ఆ రాష్ట్రంలో ప్రధానమైన వంతెన కురుంగ్ బ్రిడ్జ్ భారీ వరదలకు కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఈ వంతెన కొట్టుకుపోవడంతో పాలిన్, యాజాలి, ఇటానగర్ లో జనజీవనం స్తంభీంచిపోయింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇటానగర్ లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. కరీంగంజ్, లఖింపూర్, టిన్సుకియా, దిబ్రూగఢ్, జిల్లాలో అత్యధికంగా నిరాశ్రయులయినట్లు విపత్తు శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19 జిల్లాల్లోని 1,275 గ్రామాలు వర్షాల వల్ల ప్రభావితం అయ్యాయి. రాష్ట్రం వ్యాప్తంగా 6.4 లక్షల మంది వరదల వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 11 జిల్లాల్లోనే 72 సహాయ శిబిరాల్లో 8,220కి పైగా మంది ఆశ్రయం పొందుతున్నారు. అరుణాచల్ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర, దేఖో, సుబంసిరి, దేశాంగ్, బురిదేహింగ్, బరాక్, బెకి నదులు ప్రమాదస్థాయిని అడుగులు దాటి ప్రవహిస్తుంది. దీంతో ముంపు గ్రామాల ప్రజలను రక్షించేందుకు అధికారులు రైఫిల్స్ సాయం కోరుతున్నట్లు సమాచారం.. నంసాయ్, చాంగ్లాంగ్ ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 500 మందికి పైగా బాధితులను విపత్తు నిర్వహణ శాఖ రక్షించింది. మరి కొన్ని రోజులు కూడా వర్షాలు ఇలా ఉంటాయని ఐఎండీ తెలిపింది.

దీంతో ముందు జాగ్రత్తగా ఆ రాష్ట్ర విద్యాశాఖ అరుణాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకోని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలను, విద్యాసంస్థలు జూలై 7 వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.