దేవర మూవీ మొదలవ్వకముందు తారక్ తో ఓ కథని ప్లాన్ చేశాడు కొరటాల శివ. కాని ఏమైందో ఏమో కాని, కథ మార్చి, అంతకుమించిన కథని మరీ డిటేల్డ్ గా రాసుకున్నాడు. ఇప్పుడు సగం సినిమా షూట్ చేశాక పార్ట్ 2 ఎనౌన్స్ చేశాడు. దీనికి కారణం, రాజమౌళి, ప్రశాంత్ నీల్ దారిలో నడవటమే.
బాహుబలి 1,2, కేజీయఫ్ రెండు భాగాలు, పొన్నియన్ సెల్వం రెండు భాగాలు, ఇలా అన్నీ వర్కవుట్ అయ్యాయి. రెండు భాగాలుంటే, మొదటి భాగం చూసే జనం ముందే రెండో భాగం రాబోతోందని మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. సో మొదటి భాగంలో ఏమాత్రం లోపాలున్న, రెండో భాగంలో చెప్పే కథకి ఏదో లింకుందని, తమకి తామే కన్విస్స్ అయ్యే చాన్స్ ఉంది.
ఇదొక్కటే కాదు, సీక్వెల్స్ ఉన్న ప్రతీమూవీ మొదట్లో 300 నుంచి 500 కోట్లు రాబడితే, రెండో భాగం ఈజీగా వెయ్యి కో ట్లకు పైనే రాబట్టింది. సో మొదటి భాగం వచ్చి ఆడాక, రెండో భాగాన్ని పెద్దగా ప్రమోట్ చేయకున్నా వందలకోట్లు కాస్త వెయ్యికోట్లనీ ఈజీగా దాటేస్తాయి.. అందుకే దేవర 2 నిప్లాన్ చేసినట్టున్నాడు కొరటాల శివ. ఒక హిట్ వచ్చాక రెండో మూవీ తీసి, అదే స్తాయిలో హైప్ తీసుకురావటం తేలికకాదు. అందుకే ఒకే కథని రెండు భాగాలు చేస్తే జనాలకు ఈజీగా రీచ్ అవుతుంది. ఈ ప్లాన్ బాగుందని అంతా రెండు భాగాల సినిమాలు తీయాలనుకుంటే కుదరదు. స్కంద్ 2 ప్లాన్ చేశారు కాని మొదటి భాగం ప్లాపైంది. పెద కాపు 1 ప్లాప్ తర్వత పార్ట్ 2 ఆగిపోయేలా ఉంది. ఇలా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టే రెండు భాగాల కథ ఎనౌన్స్ చేసినంత ఈజీకాదు, ఎగ్జిగ్యూట్ చేయటం.