మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ లో పరిస్థితి మరింత వింతగా ఉంది. ఈసారి టికెట్ ఎవరికీ అని పకాగ చెప్పే పరిస్తితి లేదు. ఇలాంటి పరిణామాల మధ్య మహబూబాబాద్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. గులాబి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది.. ఆయన కోపానికి గురైంది ఎవరో కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యే నే!! కోపం అంటే ఎలాంటి ఇలాంటి కోపం కాదు. ఎందుకు కాలిందో కానీ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంటే కేటీఆర్ కు బాగానే కాలినట్టు కనిపించింది సీనియర్. ఎమ్మెల్యే ను తోసిపారేశాడు. టవల్ విసిరి కొట్టాడు. బోకే వద్దన్నాడు.. ఇదంతా చూసి జనం ముక్కున వేలేసుకున్న పరిస్థితి . సొంత పార్టీ ఎమ్మెల్యేను చీదరించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ వెనకాల నుండి పరుగున వచ్చి కేటీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే కేటీఆర్ శంకర్ నాయక్ చేయిని తోసివేశారు. దాంతో ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు సాగారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జిల్లాలో శంకర్ నాయక్ వర్సెస్ ఎంపీ కవిత మధ్య గత కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రి సత్యవతి రాథోడ్ తోనూ శంకర్ నాయక్‌కు విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ నాయక్ తీరు పార్టీకి డ్యామేజ్ చేస్తోందని అధిష్టానం దగ్గరకు చాలా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కేటీఆర్ శంకర్ నాయక్ పట్ల ఈ రీతిగా వ్యవహరించారా లేక ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగిందా అనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ మాత్రమే కాదు.. ఆ మధ్య కేసిఆర్ కూడా శంకర్ నాయక్ కు క్లాస్ పీకాడు. హోలీ పండగ రోజు మద్యం తాగుతూ శంకర్ నాయక్ డాన్స్ చేసిన ఘటన రేపిన రచ్చ అంత ఇంత కాదు. కేసిఆర్ అప్పుడే శంకర్ నాయక్ మీద ఫైర్ అయ్యారు.. ఇప్పుడు కేటీఆర్ అయితే అంతకుమించి! మాట్లాడమే చిరాకు అన్నట్లు వ్యవహరించారు.. శంకర్ నాయక్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ గోవిందా..గోవిందా.. అంటున్నారు ఈ. వీడియో చూసిన వాళ్ళు.