Telangana assembly elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పొంగులేటి నివాసంలో ఈడీ, ఐటీ విస్తృత తనిఖీలు..

అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో.. ఆఫీసుల్లో ఏక కాలంలో ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో.. ఆఫీసుల్లో ఏక కాలంలో ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి.

Telangana : తెలంగాణ సీమాంధ్రులు మనసు మార్చుకున్నారా? .. మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారా ?

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో, పాలేరు క్యాంపు ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు పరుపుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి పొంగులేటి ఇంట్లో తనిఖీలు మొదలుపెట్టారు ఈడీ (ED), ఐటీ (IT) అధికారులు. కాగా నేడు పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి పాలేరు అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో పొంగులేటి నివాసానికి భారీగా అనుచరులు చేరుకున్నారు. భారీగా అనుచరులు రావడంతో పొంగులేటి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతాతో.. అదనపు బలగాలను మోహరించారు.

ఈ విషయం పై పొంగులేటి గతంలో నే జోష్యం చెప్పారు. త్వరలోనే తనపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు జరిగే అవకాశ ఉందని పొంగులేటి మీడియా ముఖంగా వెల్లడించారు ఆయన అన్నట్లుగానే ఇవాళ ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ముందుగానే కాంగ్రెస్ కు కొద్ది రోజులు ఇబ్బందులు తప్పవని గతంలో వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఈ దాడులపై పొంగులేటీ స్పందిస్తూ.. రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై తన మీద దాడులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడో చెప్పాను బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ఒక్కటే అని.. గల్లీలో కొట్టుకుంటా కనిపించినా.. ఢిల్లీలో మాత్రం కలిసిపోతాయని మండిపడ్డారు.