Telangana, IT Rides : తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్.. భాస్కర్ రావు అనుచరుల ఇంట్లో ఐటీ తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల (Telangana Elections) వేళ రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి బీఆర్ఎస్ నాయకులు పై ఐటీ దాడులు. హైదరాబాద్, మిర్యాలగూడ, నల్గొండ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల (Telangana Elections) వేళ రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి బీఆర్ఎస్ నాయకులు పై ఐటీ దాడులు. హైదరాబాద్, మిర్యాలగూడ, నల్గొండ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అనుచరుల ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వింస్తున్నారు.

Nara Chandrababu Naidu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ దాఖలు.. నివేదికలోని విషయాలివే..!

మిర్యాలగూడ (Miryalaguda), నల్గొండ, హైదరాబాద్ సహా 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు శ్రీధర్ తో పాటు వాళ్ల కుమారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇక వైదేహి కన్స్ట్రక్షన్ పేరుతో నల్లమోతు భాస్కర్ రావు అనుచరులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

ASSEMBLY ELECTIONS: 24 స్థానాల్లో ఒకే పేరుతో అభ్యర్థులు.. బీఆర్ఎస్‌ను మాములు టార్గెట్‌ చేయలేదుగా..

ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే గా ఉన్న నల్లమోతు భాస్కర్ రావు (Nallamothu Bhaskar Rao) దేశవ్యాప్తంగా వ్యాపారాలతో పాటు.. పలు పవర్ ప్లాంట్లలో ఆయన పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు భారీగా డబ్బుల నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో తనిఖీలు చపట్టారు ఐటీ శాఖ. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి 40 బృందాలుగా ఏర్పడి.. భాస్కర్ రావు ఇళ్లు.. వారి బంధువులు, స్నేహితుల ఇళ్లు.. కార్యాలయాల్లో దాడులు చేశారు.

Kishan Reddy: బీఆర్ఎస్ గూండాల దాడి అమానుషం : కిషన్ రెడ్డి

హైదరాబాద్ లో పలువురు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు (IT Raids ) చేపట్టారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బడంగపేట్ మేయర్ పారిజాతా నర్సింహ్మారెడ్డి ఉన్నారు. ఏకకాలంలో పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. తదుపరి విచారణ కోసం హైదరాబాద్ రావాలని పొంగులేటి కుటుంబీకులకు ఐటీ శాఖ అధికారులు ఆదేశించారు. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు బడంగపేట్ మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి (Parijatha Narsimha Reddy) ఇళ్లలో దాడులు నిర్వహించారు. మరోవైపు శంకర్ పల్లి మండలం మాసానిగూడతోపాటు చేవెళ్ల మండలం తంగడపల్లి, శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఉన్న కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (Kichannagar Lakshma Reddy) వ్యవసాయ క్షేత్రాలలోనూ తనిఖీలు చేశారు.

JANASENA: భూ కేటాయింపు పేరుతో వైసీపీ స్కాం.. మరో స్కాం బయటపెట్టిన జనసేన నేత నాదెండ్ల

ఇటీవలే కొన్ని రోజులు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) అనుచరుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. కాగా ఈ సోదాల్లో సబితా అనుచరురాలుగా ప్రచారం ఉన్న నరేంద్రరెడ్డి ఇంట్లో రూ. 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ. 5 కోట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.