సెటిల్మెంట్ దిశగా దువ్వాడ వ్యవహారం, వాణీ 5 డిమాండ్లు ఇవే…!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం పరిష్కారం దిశగా బందువుల మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇరు వర్గాలతో మధ్యవర్తుల చర్చలు జరుపుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 11:40 AM IST

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం పరిష్కారం దిశగా బందువుల మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇరు వర్గాలతో మధ్యవర్తుల చర్చలు జరుపుతున్నారు. మధ్యవర్తుల ముందు ఐదు డిమాండ్లను వాణి ఉంచారు. సోదరుడు శ్రీధర్ ద్వారా వాణి డిమాండ్లను శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్ళారు. వాణి డిమాండ్లపై శ్రీనివాస్ నిర్ణయం కోసం మధ్యవర్తులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

వాణి వైపు నుంచి ఐదు డిమాండ్లను పరిశీలిస్తే… స్థిరాస్థులన్ని ఇద్దరు కుమార్తెలు పేరును రిజిస్టేషన్ చేయాలి అని మొదటి షరతు విధించారు ఆమె. శ్రీనివాస్ తదనానoతరం ఆస్తులు పిల్లలకే చెందాలి అని స్పష్టం చేసారు. స్థిరాస్తులు కుటుంబ సభ్యుల అంగీకారం లేనిదే అమ్మడానికి వీలు లేదు అన్నారు. పిల్లలను శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటోన్న ఇంట్లో ఉండేoదుకు అనుమతించాలి అని డిమాండ్ చేసారు. దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వకూడదని 5 డిమాండ్ లను శ్రీనివాస్ ముందు ఉంచారు. గత వారం రోజుల నుంచి ఈ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసారు.