Jammu and Kashmir Earthquake : జమ్మూకాశ్మీర్ లో భూకంపం.. లద్దాక్ లో భూ ప్రకంపనలు..

జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. జమ్మూకాశ్మీర్ లోని నార్త్ భూభాగంలో భూకంపం సంభించింది.

జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. జమ్మూకాశ్మీర్ లోని నార్త్ భూభాగంలో భూకంపం సంభించింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బారాముల్లా (Baramulla) జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ఆ ప్రకంపనలు లద్దాక్ లోని లేహ్ వరకు కపించి అక్కడి ప్రజలు భయందోళనకు గురయ్యారు. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.1గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.

కాగా ఈ భూకంపం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రా ఎర్పడినట్లు గుర్తించారు. కాగా, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలతో లేహ్ మార్కెట్ లోని ఉన్న ప్రజలు, దుకాణదారులు, టూరిస్టులు ఒక్కసారిగా పరుగులు తీసారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.