Earthquake on the Moon: చంద్రుడిపై భూకంపాలు వస్తాయా.. అవి ఎన్ని రకాలుగా ఉంటాయి.. వాటి తీవ్రత ఎంత..?

భూకంపాలు భూమిపైనేనా.. చంద్రుడిపైన రావా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది.

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 01:07 PM IST

సాధారణంగా భూకంపాలను సముద్రాలలో, భూమిపైన, ఎత్తైన పర్వతాలలో చూస్తూ ఉంటాము. కానీ చంద్రునిపై కూడా భూకంపాలు సంభవిస్తాయన్న విషయాన్ని తాజాగా విక్రమ్ ల్యాండర్ కనుగొంది. భూమిపై ఉన్న తీవ్రతకంటే కూడా 20 రెట్లు అధికంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనిని గతంలో అపోలో 17 రాకెట్లు అక్కడి భూకంపాలను కనుగొనేందుకు సీస్మోమీటర్లు ఏర్పాటు చేసింది. అయితే ఇవి కేవలం 5ఏళ్ళు మాత్రమే పనిచేశాయి. ఈ కాలంలో అక్కడ సుమారు 12వేల భూకంపాలు సంభవించినట్లు గుర్తించారు. ఆ సమాచారాన్ని మొత్తం పరిశీలించి నాలుగు రకాల భూకంపాలుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

చంద్రుడిపై వచ్చే భూకంపాలు ఇవే.

లోతైన భూకంపం

తేలికపాటి భూకంపం

నిస్సార భూకంపం

ఉల్కా భూకంపం

లోతైన భూకంపం..

సాధారణంగా చంద్రుడు సముద్రాలపై ఎక్కువ ప్రభావం చూపుతాడు. అదే విధంగా చంద్రుడిలోని లోతైన కోర్ ప్రాంతంలో భూమి అధికంగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ లోతైన భూకంపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి అత్యంత సాధారణమైనవిగా చెబుతున్నారు. చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 700 కిలో మీటర్ల వరకూ ప్రభావం చూపుతాయని కనుగొన్నారు.

తేలికపాటి భూకంపాలు..

చంద్రుడి లోపల టెక్టోనిక్ ప్లేట్ లో ఈ మధ్య ఏర్పడిన పెద్ద రంధ్రం కరణంగా పరస్పరం చర్య జరిగి ఇలాంటి భూకంపాలకు కారణమైనట్లు శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇక్కడ నమోదయ్యే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.5 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

నిస్సార భూకంపాలు..

నిస్సార భూకంపాలు అంటే అంతగా ప్రభావం చూపవంటున్నారు. ఇవి కేవలం కొన్ని సెకన్ల పరిథిలో మాత్రమే అప్పుడప్పుడూ సంభవిస్తూ ఉంటాయని చెబుతున్నారు. వీటి తీవ్రతను ఇప్పటి వరకూ ఎక్కడా గుర్తించలేదు.

ఉల్కా భూకంపాలు..

చంద్రుడిపై ఉల్కలు పరస్పరం ఢీకొంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే చంద్రుడిపై వాతావరణ మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఒకసారి అధిక ఉష్ణోగ్రతలు ఉంటే.. మరోసారి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనికి కారణం మనకు 14 రోజులపాటూ పగలు, మరో 14 రోజులు రాత్రి కలిపి చంద్రుడిపై ఒక రోజుగా గుర్తించారు. అలాంటప్పుడు రాత్రి ఉష్ణోగ్రతల్లో అధికంగా -155 డిగ్రీల చలి ఉంటుంది. అదే పగటి ఉష్ణోగ్రతల్లో అయితే 121 డిగ్రీల వేడి ఉంటుంది. దీని కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

చంద్రుడిపై భూకంపాలు అధిక సమయం ఉంటాయని గత పరిశోధనల్లో తేలింది. మన ఉపరితలం కంటే చంద్రుడి ఉపరితలంలో చాలా గట్టిగా ఉంటుంది. మనకు భూమిపైన 10 సెకన్ల నుంచి నిమిషం వ్యవధిలో భూకంపాలు సంభవిస్తే.. చంద్రుడి ఉపరితల దృఢత్వం కారణంగా 10 నిమిషాల వరకూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కోసారి గంటల పాటూ కూడా దీని ప్రభావం చూపుతుందని గుర్తించారు.

T.V.SRIKAR