BRS Venkatrami Reddy : బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఈసీ

అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని షాకి తగిలింది. ఆ పార్టీ మెదక్‌ అభ్యర్థి నిర్వహించిన ఓ మీటింగ్‌ ఏకంగా 106 మంది ఉద్యోగాలు పోయేలా చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని షాకి తగిలింది. ఆ పార్టీ మెదక్‌ అభ్యర్థి నిర్వహించిన ఓ మీటింగ్‌ ఏకంగా 106 మంది ఉద్యోగాలు పోయేలా చేసింది. మెదక్‌ పార్లమెంట్‌ (Medak Parliament) నియోజకవర్గంలో వెంకట్రామిరెడ్డిని తమ అభ్యర్థిగా బీఆర్ఎస్‌ పార్టీ ప్రకటించింది. ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా లేకపోవడంతో వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపుకు సహకరించే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం సిద్ధిపేటలో వెంకట్రామిరెడ్డి ఓ మీటింగ్‌ నిర్వహించారు. స్థానికంగా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఆ మీటింగ్‌కు పిలిచారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు వేయాలంటూ వాళ్లతో మీటింగ్‌ నిర్వహించారు.

ఇదే విషయంపై ఈసీకి (EC) ఫిర్యాదు వెళ్లింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఉద్యోగులు ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు వెళ్లడం నిషేదం. అలా చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటుంది ఈసీ. దీంతో ఈ మీటింగ్‌ వెళ్లి ఉద్యోగులందరి లిస్ట్‌ రెడీ చేసింది. వెంటనే ఆ లిస్ట్‌ను సిద్ధిపేట్‌ (Siddipet) జిల్లా కలెక్టర్‌కు ఫార్వర్డ్‌ చేసి వాళ్లపై యాక్షన్‌ తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు సిద్ధిపేట్‌ కలెక్టర్‌. వీళ్లందరిపై సిద్ధిపేట్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఎన్నికల కోసం వెంకట్రామిరెడ్డి నిర్వహించిన ఒక్క మీటింగ్‌ ఇప్పుడు 106 కుటుంబాలను రోడ్డున పడేసింది. ఒకేసారి ఈ స్థాయిలో సస్పెన్షన్స్‌ జరగడం సిద్ధిపేట రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.