PAWAN KALYAN: జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్.. గ్లాస్ గుర్తు లేదు.. 8మందికి వేరే సింబల్స్..

జనసేన పెట్టుకున్న రిక్వెస్ట్‌తో 2023 సెప్టెంబర్‌లో తిరిగి జనసేనకే గ్లాస్ గుర్తు కేటాయించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయనుంది. అయితే తెలంగాణలో జనసేన చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో ఆ పార్టీని గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ ఇక్కడ గుర్తించలేదు.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 05:51 PM IST

PAWAN KALYAN: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఆ పార్టీకి గుర్తింపు లేకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును కేటాయించలేదు. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది జనసేన. ఆ పార్టీకి ఇక్కడ గుర్తింపు లేకపోవడంతో పోటీ చేసిన 8 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మాత్రమే గుర్తించనుంది ఈసీ. జనసేన పార్టీకి 2018లో కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది.

PAWAN KALYAN: ఇదీ పవన్‌ రేంజ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మద్దతు కోరిన లండన్‌ మేయర్‌ అభ్యర్థి..!

ఏపీతో పాటు తెలంగాణలోనూ ఈ గుర్తుతో పోటీ చేయవచ్చని ఎన్నికల సంఘం అప్పట్లో అనుమతి ఇచ్చింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ సీట్లకు జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసే అవకాశం కలిగింది. ఆ తర్వాత 2023 మేలో దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించినప్పుడు.. జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది ఈసీ. దీనిపై జనసేన పెట్టుకున్న రిక్వెస్ట్‌తో 2023 సెప్టెంబర్‌లో తిరిగి జనసేనకే గ్లాస్ గుర్తు కేటాయించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయనుంది. అయితే తెలంగాణలో జనసేన చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో ఆ పార్టీని గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ ఇక్కడ గుర్తించలేదు. అందుకే గ్లాస్ గుర్తును ఈసీ రిజర్వ్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న 8 స్థానాల్లోని అభ్యర్థులను ఇండిపెండెంట్లుగానే ఈసీ గుర్తిస్తుంది.

జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులుగా కాకుండా.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్‌గానే వాళ్ళని గుర్తిస్తారు. అప్పుడు ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు కేటాయించే గుర్తుపైనే వాళ్ళు పోటీ చేయాల్సి ఉంటుంది. జనసేన అంటే గాజు గ్లాసు సింబల్ అని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రజల్లో గుర్తింపు పొందింది. ఇప్పుడు జనసేన అభ్యర్థులు వేర్వేరు గుర్తులతో జనంలోకి వెళితే వాళ్ళను గుర్తించడం కష్టమే అంటున్నారు. దాంతో జనసేన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.