ECI SHOCK TO JAGAN: అందుకే తప్పించారా ? ఆ ఇద్దర్ని అందుకే తప్పించారా ?

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు, విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 11:37 AM IST

ECI SHOCK TO JAGAN: ఎన్నికల వేళ ఏపీలో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులపై ఈసీ బదిలీ చర్యలు తీసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు, విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతకీ ఈ ఇద్దరు పోలీసు అధికారుల ట్రాన్స్‌ఫర్‌కు కారణమేంటి. ఏపీలో ఎలక్షన్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఓవైపు ఎండలు దంచేస్తుంటే.. అంతకు మించి అనే రేంజ్‌లో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది.

Rajinikanth: సూపర్ స్టారా మజాకా..? ఆసియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్..?

ఇదే సమయంలో.. ఎలక్షన్‌ కమిషన్ ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరిని వెంటనే విధుల నుంచి బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని డ్యూటీ అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఓ అగంతుకుడు రాయితో దాడి చేశాడు. ఈ దాడిలో సీఎం జగన్‌కు గాయమైంది. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓసారి సీపీ కాంతి రాణా నుంచి వివరణ తీసుకున్న ఈసీ.. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసింది. మరోవైపు.. జగన్‌పై దాడి విషయాన్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్‌ విఫలమైనట్లు ఈసీ భావించినట్లు సమాచారం.

అందుకే కాంతి రాణాతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులను ట్రాన్స్‌ఫర్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ డీజీ, బెజవాడ సీపీగా ఎవర్ని నియమించాలనే అంశంపై బుధవారం మధ్యాహ్నాం 3 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని ఈసీ కోరింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా పంపాలని ఏపీ సీఎస్ కు సూచించింది. ఈమధ్య కాలంలో ఏపీలో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువాపై బదిలీ వేటు వేసింది ఈసీ. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఈసీ ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.