MLC KAVITHA: అరెస్ట్ ఎందుకంటే.. కవితపై పక్కా ఎవిడెన్స్.. ఈడీ సంచలన ప్రకటన

ఢిల్లీ ఎక్సైజ్ పాలనీని రూపొందించడం, అమలు చేయడంలో కవితతో పాటు ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలసి కుట్ర పన్నినట్టు తమ దర్యాప్తులో తేలినట్టు ఈడీ తెలిపింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలను లంచాలంగా అందించింది కూడా కవితేనని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు.

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 06:54 PM IST

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఆమె అరెస్ట్‌పై ఈడీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఎంత కీలకంగా వ్యవహరించిందో ఈ ప్రెస్ నోట్‌లో వివరించింది. వంద కోట్ల ముడుపుల్లో కవిత ప్రమేయం ఉందని స్పష్టంగా తెలిపారు ఈడీ అధికారులు. తాము రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితోనే కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు.

KADIYAM KAVYA: కడియం కావ్యకి అసమ్మతి సెగ.. టిక్కెట్ వద్దంటున్న BRS లీడర్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలనీని రూపొందించడం, అమలు చేయడంలో కవితతో పాటు ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలసి కుట్ర పన్నినట్టు తమ దర్యాప్తులో తేలినట్టు ఈడీ తెలిపింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలను లంచాలంగా అందించింది కూడా కవితేనని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో ఆమెకు లింకులు ఉన్నట్టు ఈడీ తెలిపింది. ఆప్ లీడర్లతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. కవిత ఇంట్లో ఈనెల 15న సోదాలు చేశామన్నారు. సోదాలు సమయంలో ఆమె బంధువులు, అనుచరులు.. తమ విధులకు ఆటంకం కలిగించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి దాకా 245 చోట్ల సోదాలు నిర్వహించినట్టు ఈడీ అధికారులు ప్రకటించారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలో సోదాలు చేశామన్నారు. ఈ కేసులో 128 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించి జప్తు చేశామని తెలిపారు.

5 సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామన్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ చేసినట్టు వివరించారు. మరోవైపు కవిత కేసు ఈ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. కవితను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె భర్త అనిల్ వేసిన పిటిషన్ ని కూడా ఈ ధర్మాసనమే విచారణకు చేపట్టే అవకాశాలున్నాయి. ఈడీ అధికారుల ముందు అనిల్ సోమవారం నాడు గైర్హాజరయ్యారు. 10 రోజుల దాకా తాను అటెండ్ కాలేనని ఈడీ అధికారులకు లెటర్ పంపినట్టు తెలుస్తోంది. అందుకే కవితతో ములాఖత్‌కు కూడా కేటీఆర్, హరీష్ మాత్రమే వెళ్ళారు.