ప్రపంచ వ్యాప్తంగా కోడి గుడ్డులకు భారీ కొరత వచ్చింది. అమెరికాలో 60శాతం గుడ్డురేటు పెరిగింది. యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా గుడ్డు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మన దేశంలోనూ కోడిగుడ్డు సంక్షోభం మొదలైంది. మహారాష్ట్రలో భారీగా కోడి గుడ్డు కొరత వచ్చింది. మలేషియా, ఇండియా నుంచి 5 కోట్ల కోడిగుడ్లు దిగుమతి చేసుకున్నాయి. అమెరికాలో డజను గుడ్లు ఇంతకు ముందు 140 రూపాయలు ఉంటే…ఇప్పుడు డజను గుడ్లు 350 రూపాయలకు చేరుకున్నాయి.
కిందట ఏడు వచ్చిన బర్డ్‌ఫ్ల్యూ ఎఫెక్ట్‌తో చాలా దేశాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుంది. దాని ఫలితమే ఈ గుడ్లు దొరకకపోవడం. అమెరికాలోనూ, యూకేలోనూ షాపుల్లో కోడిగుడ్లు దొరకడం లేదు. కాలిఫోర్నియాలో బర్డ్‌ఫ్యూ బయంతో(కేజ్ బర్డ్స్‌పై ) కోడిగుడ్లను నిషేధించారు. దీంతో ఉత్పత్తి మొత్తం పడిపోయింది.
కొన్ని దేశాలకు ఇండియా ఎగుమతులు చేస్తోంది కానీ, ఈ ఎగుమతులు సరిపోవు. చైనా నుంచి భారీగా గుడ్లు ఎగుమతి అవుతున్నా…చైనా కోడి గుడ్డుకు మార్కెట్లో అంత నాణ్యమైనది కాదని వాటిని ఎక్కువగా తినరు. ప్రపంచంలో కోడి గుడ్ల ఉత్పత్తుల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇండియా తన అవసరాలకు సరిపోయే గుడ్ల ఉత్పత్తి లేవు. ప్రధానంగా ఇండియన్ బ్రేక్ ఫాస్ట్‌లో కూడా గుడ్డు వినియోగం పెరిగింది.
అమెరికా యూరప్ దేశాల్లో బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు కంపల్సరీ. దీంతో వారు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటు మహారాష్ట్రలోనూ 60 శాతం ఉత్పత్తి పడిపోయంది. దీంతో తమిళనాడు, తెలంగాణ నుంచి మహారాష్ట్ర దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇండియాకు కూడా కోడి గుడ్డు సంక్షోభం తప్పదేమో.