సినీ హీరో రామ్ చరణ్… కడప దర్గాను అయ్యప్ప మాలలో ఉన్న సమయంలో సందర్శించడం పట్ల… తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక మండిపడింది. అయ్యప్ప మాల అంటే చాలా నియమ నిబంధనలతో ఉంటుందన్న ఐఖ్య వేదిక… అయ్యప్ప మాల దశాబ్దాల నుండి మెగా కుటుంబం వేస్తోంది అని… సనాతన ధర్మాన్ని పాటిస్తున్న మెగా కుటుంబం… కానీ నిన్న కడప దర్గాకి వెళ్లడం రామ్ చరణ్ వెళ్లడం బాధాకరం అని వ్యాఖ్యలు చేసింది.
ముస్లిం ఆచారం పాటిస్తూ…అక్కడ దర్గాని సందర్శించారని మండిపడ్డారు. ఏ ఆర్ రెహ్మాన్ కోసం ఆయన దర్గా కి వెళ్ళాడని ఆరోపించారు. మరి రామ్ చరణ్ ….నీకోసం తిరుమల ..శబరిమల కు రెహ్మాన్ ని తీసుకొచ్చే దమ్ముందా అని నిలదీశారు. రామ్ చరణ్ యావత్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మాల వేసుకున్నప్పుడు మండలం పాటు కచ్చితంగా పాటించాలని సూచించారు.
రామ్ చరణ్ కు గురు స్వామి ఎవరు.. ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక వైపు సనాతన ధర్మ కోసం ….పోరాటం చేస్తూ.. దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంటే …రామ్ చరణ్ మాత్రం ఇలా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నాడు అని మండిపడ్డారు. రామ్ చరణ్ చేసిన పని వల్ల మెగా కుటుంబానికి హిందువులు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు.