దేశ వ్యాప్తంగా మొన్నె సార్వత్రిక ఎన్నికలు (General Elections) ముగిశాయి. కాగా మళ్లీ దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం..
ఇక విషయంలోకి వెళితే..
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో (7 States ) 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు (By-elections) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఎన్నికలు, 13వ తేదీన ఓట్ల ఓట్ల లెక్కింపు జరుగుతాయని అధికారులు తెలిపారు. కాగా ఈ (By Elections) ఉప ఎన్నికలు బిహార్(రూపాలి నియోజకవర్గం), వెస్ట్ బెంగాల్ (రాయ్ గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మాణిక్తలా), తమిళనాడు(విక్రవాండి), మధ్యప్రదేశ్(అమరవాడ), ఉత్తరాఖండ్ (బద్రినాథ్, మంగ్లౌర్), పంజాబ్ (జలంధర్ పశ్చిమ), హిమాచల్ ప్రదేశ్ (డెహ్రా, హమీర్‌పూర్, నలాగర్) లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు జరుగుతాయి.
ఈ ఉప ఎన్నికలు జూలై 14న నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. 21 తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారని, 24వ తేదీన పరిశీలిస్తామని తెలిపారు. అయితే 26 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అని అధికారులు తెలిపారు.