ELECTORAL BONDS: అంతా సీక్రెట్.. 1000 కోట్లు ఇచ్చిన కాళేశ్వరం కాంట్రాక్టర్

సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఉన్నఫళంగా ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టిన SBI.. ఏ పార్టీకి ఏ సంస్థలు ఎంత నిధులు అందించాయన్నది మాత్రం సీక్రెట్‌గా ఉంచింది. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయిన ఒక లిస్టులో ఏయే కంపెనీలు ఎంతెంత ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయో ఉంది.

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 11:40 AM IST

ELECTORAL BONDS: వివాదాస్పదంగా మారిన ఎన్నికల బాండ్ల డేటాను ఈసీ బయటపెట్టింది. ఐదేళ్లలో పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా 12 వేల 155 కోట్ల విరాళాలు అందినట్టు తేలింది. దేశంలోనే బీజేపీ అత్యధిక విరాళాలు పొందింది. ఆపార్టీకి 6 వేల 61 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. ఇక అంతా ఆశ్చర్యపోయేలా రెండో ప్లేస్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీకి 16 వందల 10 కోట్లు వచ్చాయి. అలాగే మూడో స్థానంలో కాంగ్రెస్‌, నాలుగో ప్లేసులో బీఆర్ఎస్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఉన్నఫళంగా ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టిన SBI.. ఏ పార్టీకి ఏ సంస్థలు ఎంత నిధులు అందించాయన్నది మాత్రం సీక్రెట్‌గా ఉంచింది.

Devara: గోవాలో ల్యాండింగ్.. బాహుబలి బాటలో దేవర..

ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయిన ఒక లిస్టులో ఏయే కంపెనీలు ఎంతెంత ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయో ఉంది. మరో లిస్టులో ఏయే పార్టీలకు ఎంతెంత విలువైన బాండ్స్ అందాయో ఉంది. కానీ ఏ కంపెనీ.. ఏ పార్టీకి.. ఎంత మొత్తం ఇచ్చిందన్న అన్నది మాత్రం బయటకు రాలేదు. ఫండ్ ఇచ్చిన తేదీ, పార్టీ పొందిన తేదీలను కంపార్ చేసుకొని.. ఏ పార్టీకి ఎంత వెళ్ళి ఉంటాయని అంచనాలు వేసుకోవడమే తప్ప.. ఫలానా పార్టీకి ఇంత అమౌంట్ వెళ్ళింది అన్న క్లారిటీ మాత్రం లిస్టుల్లో క్లారిటీ రాలేదు. పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ సంస్థల్లో ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీసెస్ 13 వందల 68 కోట్ల రూపాయలతో ఫస్ట్ ప్లేసులో ఉంది. కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ 966 కోట్ల రూపాయలను ఇచ్చింది. క్విక్ సప్లయ్ చైన్ 410 కోట్లు, వేదాంత లిమిటెడ్ 400 కోట్లు, భారతీ గ్రూప్ 247 కోట్లు ఇచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు మొత్తం 24 వేల 737 కోట్లు విరాళాలు అందినట్టు అనధికారిక సమాచారం. ఇందులో అత్యధికంగా బీజేపీకి 11 వేల కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 3 వేల కోట్లు, కాంగ్రెస్‌కు 2 వేల 8 వందల కోట్లు ముట్టినట్టు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్‌కు కూడా భారీ స్థాయిలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు అందాయి.

RAM CHARAN: ముహూర్తం ఫిక్స్.. RC16 గ్రాండ్ లాంచ్ ఆ రోజే..!

ఈ పార్టీకి 2 వేల 278 కోట్లు ముట్టాయి. దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. బీజేడీకి 15 వందల కోట్లు, డీఎంకెకు 12 వందల కోట్లు, వైఎస్సార్ సీపీకి 662 కోట్లు, టీడీపీ 437 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినట్టు తేలింది. దేశంలో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్.. 13 వందల కోట్లకు పైగా ఇచ్చిన ఈ సంస్థను కోయంబత్తూరుకు చెందిన శాంటియాగో మార్టిన్ కంపెనీ 1991లో ప్రారంభించింది. 13 యేళ్ళకే లాటరీలు మొదలుపెట్టిన మార్టిన్ ను లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయనకు రియల్ ఎస్టేస్, ఇన్ ఫ్రా, టెక్స్ టైల్స్, హోటల్స్ రంగాల్లో దేశ, విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా భారీగా నిధులు ఇచ్చిన కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి. కాళేశ్వరం కాంట్రాక్టర్ అయిన మేఘా ఇంజినీరింగ్ దాదాపు వెయ్యికోట్లు నిధులు ఇచ్చింది. ఈ సంస్థ ఏ పార్టీకి ఇచ్చింది అన్నది తెలియకపోయినా.. అప్పట్లో BRS అధికారంలో ఉండటంతో.. మేఘా నుంచి ఆ పార్టీకి భారీగా నిధులు ముట్టినట్టు చెబుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా ఫండ్స్ పంపినట్టు సమాచారం.

మేఘా కాకుండా నవయుగ ఇంజినీరింగ్, మైహోం, హెటిరో ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, MSN ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, GVPR ఇంజినీర్స్ కంపెనీల్లు కోట్ల రూపాయల నిధులను పొలిటికల్ పార్టీలకు ఇచ్చాయి. రాజకీయ పార్టీలకు, కంపెనీలకు మధ్య ఫ్రుడెంట్ ట్రస్ట్ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు రాయటర్స్ కథనంలో తెలిపింది. గత 11యేళ్ళల్లో ఈ సంస్థ ద్వారా 2 వేల 256 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. 2013లో భారతీ ఎయిర్ టెల్ కంపెనీ ఫ్రుడెంట్ ట్రస్టును ఏర్పాటు చేసింది. తర్వాత ఏడాది దీన్ని స్వతంత్ర ఆడిటర్లు ముకుల్ గోయల్, వెంకటాచలం గణేష్ కు అప్పగించింది. ఈ ట్రస్టు వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధులకు మధ్యవర్తిగా ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధుల్లో.. 75శాతం వాటాను బీజేపీకే అందించినట్టు రాయటర్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఎలక్టోరల్ బాండ్ పథకం 2017లోనే ప్రారంభమైనా.. 2019 ఏప్రిల్ నుంచి మాత్రమే వివరాలకు బయటకు రావడంపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది.