Elon Musk X: ఇండియన్స్‌కు షాక్.. రెండు లక్షల ఎక్స్ అకౌంట్లు బ్లాక్

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఖాతాల్ని ప్రతి నెలా ఎక్స్ తొలగిస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే దేశంలోని రెండు లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఖాతాలలో చిన్నారులపై లైంగిక వేధింపులు, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది.

  • Written By:
  • Publish Date - April 14, 2024 / 08:11 PM IST

Elon Musk X: భారతీయ యూజర్లకు ఎక్స్ (ట్విట్టర్) షాకిచ్చింది. దేశానికి చెందిన రెండు లక్షల ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసింది. నిబంధనలు పాటించిన రెండు లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించినట్లు ఎక్స్ పేర్కొంది. ఐటీ రూల్స్ 2021 పాటించని కారణంగా వీటిని బ్లాక్ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు మొత్తం 2,12,627 ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. దేశంలో సోషల్ మీడియా సంస్థల ప్రభుత్వం రూపొందించిన ఐటీ నిబంధనలు పాటించాల్సిందే.

Hardik Pandya: వరల్డ్ కప్ జట్టులో హార్దిక్‌ కష్టమే.. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

అలా పాటించని ఖాతాలను ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలి. లేకుంటే.. వాటిపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అందుకే కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఖాతాల్ని ప్రతి నెలా ఎక్స్ తొలగిస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే దేశంలోని రెండు లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఖాతాలలో చిన్నారులపై లైంగిక వేధింపులు, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది. ఏవైనా అకౌంట్లలో అభ్యంతరకరంగా ఉంటే.. వాటిపై యూజర్లు కూడా ఫిర్యాదు చేయొచ్చనే సంగతి తెలిసిందే. అలా రిపోర్ట్ చేసిన ఖాతాల్ని పరిశీలించి కూడా ఎక్స్ నిషేధం విధిస్తుంది. ఇండియాలోని యూజర్ల నుంచి ఎక్స్‌కు 5,158 ఫిర్యాదులను వచ్చాయి. వాటిలో 86 శాతం ఫిర్యాదుల్ని ప్రాసెస్‌ చేసి, పరిశీలన అనంతరం వాటిలో 7 శాతం అకౌంట్లను బ్లాక్ చేసినట్లు ‘ఎక్స్‌’ తెలిపింది.

ఇండియన్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 3,074 వేధింపులకు సంబంధించినవి కాగా.. 412 ద్వేషపూరిత ప్రవర్తన కలిగినవి ఉన్నాయి. అలాగే అడల్ట్‌ కంటెంట్ ఉన్నవి 953, వేధింపులకు సంబంధించినవి 359, టెర్రరిజానికి సంబంధించినవి 1,235 అకౌంట్లున్నాయి. వీటన్నింటినీ ఎక్స్ బ్లాక్ చేసింది. అంతకుముందు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 మధ్య కూడా 5,06,173 ఖాతాలను తొలగించింది. ప్రతి నెలా కంపెనీ వెల్లడించే మంత్లీ రిపోర్టులో భాగంగా ఈ వివరాలు వెల్లడించాయి.