Elon Musk: ఇండియాకి ఎలాన్ మస్క్.. టెస్లా కార్ల తయారీ ఇక్కడే..

మస్క్‌ ఈనెలలోనే భారత్‌‌కు వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతారు. భారత్‌లో టెస్లా తయారీకి సంబంధించిన కీలక ఒప్పందం ఈ టూర్‌లోనే ఖరారవుతుందని తెలుస్తోంది. 22న భారత్‌ చేరుకోనున్న మస్క్‌ అదే రోజు ప్రధాని మోడీని కలుస్తారు.

  • Written By:
  • Updated On - April 11, 2024 / 04:20 PM IST

Elon Musk: టెస్లా ఇండియన్ ఎంట్రీ ఖరారైందా..? త్వరలో భారత రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీయనున్నాయా..? భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మస్క్‌ రెడీ అయ్యారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మస్క్‌ ఈనెలలోనే భారత్‌‌కు వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతారు. భారత్‌లో టెస్లా తయారీకి సంబంధించిన కీలక ఒప్పందం ఈ టూర్‌లోనే ఖరారవుతుందని తెలుస్తోంది. 22న భారత్‌ చేరుకోనున్న మస్క్‌ అదే రోజు ప్రధాని మోడీని కలుస్తారు. ఆ తర్వాత భారత్‌లో తన వ్యాపార ప్రణాళికలపై ఆయన ఓ ప్రకటన చేస్తారని చెబుతున్నారు.

Akhilesh Yadav Daughter: యూపీ ప్రచారంలో అదితి ఫిదా.. తల్లి డింపుల్ గెలుపు కోసం తంటాలు

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. చాలా కాలం క్రితమే ఈ ఆలోచన చేసినా మస్క్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పట్టాలెక్కలేదు. అయితే మారిన పరిణామాలతో ఆయన కాస్త తగ్గారు. భారత్‌ మార్కెట్‌ విస్తృతిని అర్థం చేసుకున్నారు. భారత్‌లోనే కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని మస్క్‌ చాలాకాలంగా కోరుతున్నారు. ఇటీవల భారత్‌ తన ఈవీ పాలసీలో మార్పులు చేసింది. దిగుమతి సుంకాన్ని 100 నుంచి 15శాతానికి తగ్గిస్తామని తెలిపింది. అయితే ఆ ఈవీ తయారీ సంస్థ మన దేశంలో 4వేల 150 కోట్ల పెట్టుబడితో పాటు దేశంలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని షరతు పెట్టింది. దీంతో టెస్లా ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లైంది. ముందుగా కొన్ని కార్లను దిగుమతి చేసుకుని భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్లాంటు నిర్మాణ పనులను కూడా ప్రారంభించొచ్చు.

IPHONE SPYWARE: ఐఫోన్ ఉన్నవాళ్ళు జాగ్రత్త.. మీ ఫోన్‌లో స్పైవేర్

కుడివైపు స్టీరింగ్ ఉండే కార్లను జర్మనీలో ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. వాటిని భారత్‌కు దిగుమతి చేయవచ్చని భావిస్తున్నారు. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరల్లోనే ఎంట్రీ లెవల్‌ కార్లను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై ఆ సంస్థ ప్రతినిధులు లెక్కలేస్తున్నారు. టెస్లాను తమ రాష్ట్రానికి రావాలని చాలా రాష్ట్రాలు ఆహ్వానించాయి. రాయితీలు ఇస్తామని ప్రకటించాయి. ప్లాంట్‌‌కు అవసరమైన స్థలాన్ని సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయలు కల్పించేందుకు గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు సిద్ధంగా ఉన్నాయి. టెస్లాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇప్పటికే తెలంగాణ ప్రకటించింది. 2 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 17వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటైతే స్థానికులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. అందుకోసమే చాలా రాష్ట్రాలు టెస్లా కోసం పోటీ పడుతున్నాయి.

మహారాష్ట్ర ఈ రేసులో కాస్త ముందున్నట్లు తెలుస్తోంది. ఇటు టెస్లాతో రిలయన్స్ జట్టు కట్టబోతోందన్న ప్రచారం సాగుతోంది. లోకల్‌ పార్ట్‌నర్‌ కోసం టెస్లా చూస్తోంది. దాన్ని అందిపుచ్చుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. రిలయన్స్‌ గతేడాది అశోక్‌ లేల్యాండ్‌ భాగస్వామ్యంతో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత డ్యూటీ ట్రక్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పుడు టెస్లాతో జట్టు కట్టబోతోంది. ఈ రెండు సంస్థల జాయింట్‌ వెంచర్‌పై కూడా త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ రిలయన్స్‌తో సాధ్యం కాకపోతే మరో కంపెనీతో అయినా టెస్లా జట్టు కట్టే అవకాశం ఉంది.