Elon Musk: మీరేం ఆలోచిస్తున్నారో మీకంటే ముందే మేమే గుర్తిస్తాం.. మీరు ఏం చేయబోతున్నారో పసిగట్టేస్తాం.. మీరు ఎప్పుడు తినాలో, ఎప్పుడు పడుకోవాలో అన్నింటినీ నిర్దేశించే అవకాశం మాకుంది.. అంతెందుకు మీతో హత్యలు చేయించొచ్చు, దొంగతనాలు చేయించొచ్చు.. మీరెక్కడో ఉంటారు.. మేమెక్కడో ఉంటాం.. కానీ మిమ్మల్ని ఆడించే రిమోట్ మా దగ్గర ఉంటుంది.. మేం చేతిలో ఫోన్ పట్టుకుని మీతో ఏమైనా చేయించొచ్చు.. ఏంటిది అనుకుంటున్నారా..? భవిష్యత్తులో మనిషి కూడా మర మనిషి లాగా మారిపోవచ్చు. ఇకపై అందరూ ఇస్మార్ట్ శంకర్‌లే అవ్వొచ్చు. ఇలాంటి వాళ్ళని తయారు చేయడానికి టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ ఆల్రెడీ మనుషులపై ప్రయోగాలు కూడా మొదలుపెట్టేసింది. వైద్య చరిత్రలో సరికొత్త అడుగు పడుతోంది. కొత్త సంచలనానికి నాంది పలుకుతోంది.
AYODHYA TO TIRUMALA: బాల రాముడికి వెంకన్న సాయం.. తిరుమల రద్దీపై అయోధ్య ట్రస్ట్ స్టడీ
మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. అందులోభాగంగా ఓ యువకుడి మెదడులో చిప్ అమర్చింది ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ న్యూరాలింక్. న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను గుర్తించామన్నారు మస్క్. 8 మిల్లీమీటర్ల ఎస్-1 చిప్.. దానికి సన్నని ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఒక్క చిప్ ఐదు పైసల నాణేల సైజులో ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ చిప్ అమర్చారు. వెంట్రుకలో 20వ వంతు మందం ఉండే ఎలక్ర్టోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో 3వేలకు పైగా ఎలక్ట్రోడ్లు పెట్టవచ్చు. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సంకేతాలను ఇవి గుర్తించి చిప్‌కు పంపుతాయి. ఒక వ్యక్తిలో 10 చిప్‌లు అమర్చే వీలు ఉంటుంది. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపుతుంది. అందుకుంటుంది. ప్రేరేపిస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది. అంటే వాళ్ళ ఆలోచనలను వేగంగా కంప్యూటర్లకు పంపుతుంది. ఈ ప్రయోగం ప్రస్తుతానికి వైద్య అవసరాలకు మాత్రమే వాడుతామని న్యోరాలింక్ చెబుతోంది. పార్కిన్సన్, పక్షవాతం లాంటి సమస్యలతో మంచానికే పరిమితం అయిన వాళ్ళకి ఉపయోగం ఉంటుందని అంటున్నారు.
కానీ భవిష్యత్తులో మాత్రం దీని రూపం మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 363 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజ్ అయింది. కాలిఫోర్నియాలో న్యూరాలింక్ ఆఫీస్ ఏర్పాటైంది. ఇందులో 4వందల మంది సిబ్బంది, శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. గత ఏడాదే హ్యూమన్ ట్రయిల్స్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చాయి. మెదడుకు కంప్యూటర్‌కు మధ్య కమ్యునికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే ఈ చిప్ప్ లక్ష్యం. గతంలో కోతులపై ప్రయోగాలు నిర్వహించింది న్యూరాలింక్. అంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు చాలామందే చేశారు. కానీ ఈ స్థాయి వరకు వచ్చింది మాత్రం ఎలాన్ మస్క్ కంపెనీ మాత్రమే. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అదో అద్భుతమే అనుకోవచ్చు. పక్షవాతం వచ్చిన వారు కేవలం తమ ఆలోచనల ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుసైగల ద్వారా కంప్యూటర్‌ను వాడొచ్చు. అంతెందుకు అసలు బాడీ కదలకుండా అన్ని పనులూ చక్కబెట్టేయొచ్చు.
REVANTH Vs KTR: కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ భారీ ప్లాన్.. ఇక చుక్కలే..
బటన్ నొక్కడం, టచ్‌తో ఆపరేట్ చేయడం ఇకపై గతం అనుకోవాలి. టీవీ పెట్టాలన్నా, ఫ్యాన్ వేయాలన్నా రిమోట్ కోసం వెతకాల్సిన పనిలేదు.. పెట్టాలన్న ఆలోచన రాగానే.. ఆటోమెటిక్‌గా అన్నీ ఆపరేట్ అయిపోతాయి. ఈ తరహా ప్రయోగాలు వినాశనానికి దారి తీస్తాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటికి నైతికత ఏంటి అంటూ పెద్ద పెద్ద డిబేట్లు కూడా జరుగుతున్నాయి. వైద్య అవసరాలకు మాత్రమే దీన్ని వాడతామని న్యూరాలింక్స్ చెబుతోంది. పక్షపాతంతో బాధపడుతున్న వారి కోసం నడుంలో అమర్చేలా మరో చిప్ తీసుకొస్తామని మస్క్ చెబుతున్నారు. కంటి చూపు కోల్పోయిన వాళ్ళ కోసం కూడా ఓ పరికరం అభివృద్ధి చేస్తున్నామన్నారు. పక్షవాతం వచ్చి కదల్లేని వారికి ఈ ప్రయోగాలు ఉపయోగం అని న్యూరాలింక్స్ చెబుతున్నా.. వాళ్ళ బ్రెయిన్ పై హ్యాకర్లు దాడి చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పరికరాలను హ్యాక్ చేసి.. ఆ మనుషులను రోబోల్లాగా వాడుకుంటారన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.