Elon Musk X: ఎక్స్ యూజర్లకు గుడ్‌న్యూస్.. బ్లూ టిక్ ఫ్రీ.. కానీ, వారికే..

మస్క్ తెలిపిన వివరాల ప్రకారం.. 2,500 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారికి ఇకపై బ్లూటిక్ ఫ్రీగా రానుంది. 2,500 మంది ఫాలోవర్లు చాలా మందికి ఉంటారు కదా.. ఎంచక్కా ఫ్రీగా బ్లూటిక్ దక్కించుకుందాం అంటే కుదరదు.

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 04:10 PM IST

Elon Musk X: ఎక్స్ (ట్విట్టర్) యూజర్లకు ఆ సంస్థ అధినేత మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్ యూజర్లకు బ్లూటిక్ ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు. అయితే, అందరికీ కాదు.. కొందరు యూజర్లకు మాత్రమే బ్లూ టిక్ ఫ్రీగా రానుంది. మస్క్ తెలిపిన వివరాల ప్రకారం.. 2,500 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారికి ఇకపై బ్లూటిక్ ఫ్రీగా రానుంది. 2,500 మంది ఫాలోవర్లు చాలా మందికి ఉంటారు కదా.. ఎంచక్కా ఫ్రీగా బ్లూటిక్ దక్కించుకుందాం అంటే కుదరదు.

Raghu Rama Krishna Raju: రఘురామకు టీడీపీ టిక్కెట్.. ఉండి నుంచి బరిలోకి

ఎందుకంటే.. ఆ 2,500 మంది ఫాలోవర్లు వెరిఫైడ్ అయి ఉండాలి. అంటే.. వారికీ బ్లూటిక్ వెరిఫైడ్ అయి ఉండాలి. 2,500 మంది వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు బ్లూటిక్ ద్వారా ప్రీమియం సర్వీస్, 5,000 వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న వారికి ప్రీమియం ప్లస్ సర్వీస్ ఉచితంగా అందుతుంది. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు చేశాడు. కొందరు కొందరు వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్లకు బ్లూటిక్ ఉచితంగా అందేది. తర్వాత దీన్ని మస్క్ పెయిడ్ సర్వీస్‌గా మార్చారు. బ్లూటిక్ కోసం సగటున నెలకు 8 డాలర్లు చెల్లించాలి. అయితే, దీనిపై కొందరు యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎక్స్ యూజర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో మస్క్.. ఫ్రీగా బ్లూటిక్ ఇచ్చేందుకు ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారు. ప్రీమియం ప్లస్‌ యూజర్లు యాడ్స్ లేకుండా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను గంటలోపు ఎడిట్‌ చేయొచ్చు. 25,000 అక్షరాల వరకు పోస్ట్‌ చేసే వీలుంది.

ఇక ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ డెవలప్ చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. గతంలో గ్రోక్ యాక్సెస్ చేయాలంటే ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ, ఇప్పుడు ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు కూడా యాక్సెస్ చేసే వీలు కల్పించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ నుంచి గట్ట పోటీ ఎదురవుతుండటంతో మస్క్.. యూజర్లను ఆకర్షించేందుకు ఇలాంటి ఫీచర్లు యాడ్ చేస్తూ వెళ్తున్నాడు.