Aroori Ramesh: టెన్షన్.. టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తుకెళ్లిన ఎర్రబెల్లి..

తనతో వెళ్లేందుకు రమేష్‌ సుముఖంగా లేకపోయినా.. ఆయనను కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు దయాకర్‌ రావు. సరిగ్గా పెంబర్తిలో ఎర్రబెల్లి కారును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తమ పార్టీలో జాయిన్‌ కావాల్సిన వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారంటూ కారుకు అడ్డంగా నిలబడ్డారు.

  • Written By:
  • Updated On - March 13, 2024 / 03:32 PM IST

Aroori Ramesh: పార్టీ మారకుండా నేతలను కాపాడుకోవడానికి ఓ పద్ధతి ఉంటుంది. కానీ వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ అనుసరించిన పద్ధతి ఇప్పుడు అనేక విమర్శలకు దారి తీస్తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని పార్టీతో పాటు కార్యకర్తలకు, అనుచరులకు కూడా క్లియర్‌గా చెప్పేందుకు ప్రెస్‌‌మీట్‌ ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని చెప్పి పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్‌ అయ్యారు.

PAWAN KALYAN: తెరమీద చెప్పిందే.. ఆర్జీవీ వ్యూహంలో చెప్పినట్టే పవన్‌ను తొక్కేస్తున్నారా..?

కానీ.. ప్రెస్‌‌మీట్‌ నిర్వహించడంకంటే ముందే.. ఆరూరి ఇంటికి ఎర్రబెల్లి దయాకర్‌ రావు బీఆర్ఎస్‌ నేతలతో వచ్చారు. ఆరూరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి హరీష్‌ రావుతో కూడా ఫోన్‌ చేయించారు. రమేష్‌ ఏం కోరినా ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు బీఆర్ఎస్‌ నుంచి హామీ కూడా వచ్చింది. ఇదే హామీ నేరుగా కూడా ఇప్పిస్తానంటూ రమేష్‌ను తీసుకువెళ్లారు దయాకర్‌ రావు. తనతో వెళ్లేందుకు రమేష్‌ సుముఖంగా లేకపోయినా.. ఆయనను కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు దయాకర్‌ రావు. సరిగ్గా పెంబర్తిలో ఎర్రబెల్లి కారును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తమ పార్టీలో జాయిన్‌ కావాల్సిన వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారంటూ కారుకు అడ్డంగా నిలబడ్డారు. కారులో ఉన్న రమేష్‌ను బలవంతంగా బయటికి తీసుకువచ్చారు. దయాకర్‌ రావు రమేష్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారంటూ రోడ్డుపై హల్చల్‌ చేశారు. దీంతో పెంబర్తి హైవే మీద బీఆర్ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో ఆరూరి రమేష్‌ చొక్కా కూడా చిరిగిపోయింది. తననూ ఎవరూ కిడ్నాప్‌ చేయడంలేదని.. తాను ఎక్కడికీ వెళ్లడంలేదని రమేష్‌ చెప్పినా బీజేపీ కార్యకర్తలు వినలేదు. రమేష్‌ను మభ్యపెట్టేందుకు దయాకర్‌ రావు ఆయనను హైదరాబాద్‌కు తీసుకువెళ్తున్నాడంటూ కార్లను అడ్డుకున్నారు. ఇలా ఆరూరి పార్టీ మార్పు వ్యవహారం హనుమకొండలో ఓ హైడ్రామాకు తెరలేపింది. ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలతో కలిసి రమేష్‌ హనుమకొండకు చేరుకున్నారు. మరి తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో.. దానికి బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో చూడాలి.