EETALA MALKAJ GIRI : ఈటల రాజేందర్ కే మల్కాజ్ గిరి టిక్కెట్ ! బీజేపీ క్లారిటీ ఇచ్చినట్టేనా ?

తెలంగాణలో మెస్ట్ డిమాండ్ ఉన్న మల్కాజ్ గిరి (Malkaj Giri) BJP ఎంపీ టిక్కెట్ ఈటల రాజేందర్ కు కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ (BJP) హైకమాండ్ నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టు సమాచారం. అందుకే శామీర్ పేట (Sameer Peta) లోని తన నివాసంలో ఈటల రాజేందర్ సన్నిహితులతో మీటింగ్ పెట్టారని అంటున్నారు. మల్కాజ్ గిరిలో పోటీ చేయబోతున్నట్టు ఈటల తన అనుచరులకు కాల్ చేసి పిలిపించినట్టు చెబుతున్నారు.

తెలంగాణలో మెస్ట్ డిమాండ్ ఉన్న మల్కాజ్ గిరి (Malkaj Giri) BJP ఎంపీ టిక్కెట్ ఈటల రాజేందర్ కు కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ (BJP) హైకమాండ్ నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టు సమాచారం. అందుకే శామీర్ పేట (Sameer Peta) లోని తన నివాసంలో ఈటల రాజేందర్ సన్నిహితులతో మీటింగ్ పెట్టారని అంటున్నారు. మల్కాజ్ గిరిలో పోటీ చేయబోతున్నట్టు ఈటల తన అనుచరులకు కాల్ చేసి పిలిపించినట్టు చెబుతున్నారు.

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Election) ఎక్కువగా తటస్థులు, మంచి పేరు ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో 17 లోక్ సభ ఎన్నికల్లో కనీసం 10 అయినా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. మార్చ్ ఫస్ట్ వీక్ లో ఆరు నుంచి పది మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అనౌన్స్ చేయబోతోంది. అందులో మల్కాజ్ గిరి నుంచి ఈటల రాజేందర్ పేరు కూడా ఉండవచ్చంటున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందడం వల్లే తన అనుచరులతో ఈటల సమావేశం పెట్టారని చెబుతున్నారు. ఈ సమావేశానికి రావాలని మల్కాజ్ గిరికి చెందిన బీజేపీ లీడర్లకు కూడా ఈటల సమాచారం ఇచ్చారట. కానీ కొందరు లీడర్లు డుమ్మకొట్టినట్టు తెలుస్తోంది. అధిష్టానం ఇంకా పేరు అనౌన్స్ చేయకముందు తొందరపడవద్దని కొందరు బీజేపీ లీడర్లు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మల్కాజ్ గిరి స్థానం కోసం బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) లోనూ గట్టి పోటీ నడుస్తోంది. చాలామంది ప్రముఖులు టిక్కెట్ తెచ్చుకోడానికి పైరవీలు చేస్తున్నారు. బీజేపీ నుంచి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా మల్కాజ్ గిరి టిక్కెట్ ను ఆశిస్తున్నారు. అయితే హుజూరాబాద్ లో ఓడిపోయిన ఈటల రాజేందర్… పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నందున… మల్కాజ్ గిరిలో టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది. మార్చి ఫస్ట్ వీక్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈలోగానే ఫస్ట్ లిస్ట్ బయటకు వస్తుందని భావిస్తున్నారు. మరి మల్కాజ్ గిరికి ఈటల పేరు ప్రకటిస్తే… మిగతా బీజేపీ లీడర్లు ఎంతవరకూ సహకరిస్తారన్నది చూడాలి. పార్టీలో విభేదాలు ఉండొద్దు… అందరూ కలసి పనిచేయాలని గతంలో అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా చాలామంది లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈటల ఓటమికి కొన్ని గ్రూపులో పనిచేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఆ గ్రూపులను అమిత్ షా ఎలా దారిలోకి తెస్తారో చూడాలి.